Advertisement
Advertisement
Abn logo
Advertisement

తాగొచ్చిన కొడుక్కి సపర్యలు చేస్తే.. చివరికి తల్లీ, చెల్లిని ఏం చేశాడో తెలుసా..!

మద్యం మత్తులో ఉన్నవారు ఏం చేస్తున్నామో తెలీని స్థితిలో ఉంటారు. కన్నవారు, కట్టుకున్న భార్య అనే విజ్ఞత కూడా మరిచి ప్రవర్తింటారు. తాగిన మత్తు దిగాక.. చేసిన తప్పు తెలుసుకుని చింతిస్తూ ఉంటారు. కర్ణాటకలో ఓ మందుబాబు ఇలాగే ఘోరమైన పని చేసి.. ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. మద్యం మత్తులో అతడు చేసిన పని.. వారి కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. వివరాల్లోకి వెళితే..

 


కర్ణాటకలోని సిద్ధాపుర్ తాలుకాలోని దోడ్​మణె గ్రామంలో పార్వతీ నారాయణ హస్లార్​(42) అనే మహిళ కుటుంబం నివాసం ఉంటోంది. ఈమెకు భర్త, రమ్యా నారాయణ హస్లార్​(19) అనే కుమార్తె, మంజునాథ హస్లార్​(24) అనే కొడుకు ఉన్నారు. అయితే కొడుకు మద్యానికి బానిసయ్యాడు. నిత్యం మద్యం మత్తులో ఉంటూ అందరితో గొడవ పడుతూ ఉంటాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఫుల్‌గా మద్యం సేవించి ఇంటికొచ్చాడు. అతడి తల్లి భోజనం వడ్డించింది. అయితే సాంబారు రుచికరంగా లేదని తల్లి, చెల్లెలితో గొడవ పడ్డాడు. బూతులు తిడుతూ రచ్చరచ్చ చేశాడు. ఈ క్రమంలో తల్లి మందలించడంతో మరింత ఆగ్రహానికి గురయ్యాడు.

నన్నే దండిస్తావా అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు. అంతటితో ఆగకుండా ఇంట్లో ఉన్న నాటు తుపాకీ తీసుకుని తల్లి, చెల్లెలిపై కాల్పులు జరిపాడు. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. అప్పుడే ఇంటికొచ్చిన అతడి తండ్రి.. రక్తపు మడుగులో పడి ఉన్న భార్య, కుమార్తె మృతదేహాలను చూసి బోరున విలపించాడు. దీనిపై సిద్ధాపుర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement