మీరైతే తట్టుకోగలరా?.. వైరల్ వీడియోను షేర్ చేసిన ఐపీఎస్ అధికారి

ABN , First Publish Date - 2021-03-28T02:38:08+05:30 IST

ఓ యువకుడు బైక్‌పై ఒళ్లు గగుర్పొడిచే సాహసాలు చేస్తూ పట్టుతప్పి కిందపడిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో

మీరైతే తట్టుకోగలరా?.. వైరల్ వీడియోను షేర్ చేసిన ఐపీఎస్ అధికారి

న్యూఢిల్లీ: ఓ యువకుడు బైక్‌పై ఒళ్లు గగుర్పొడిచే సాహసాలు చేస్తూ పట్టుతప్పి కిందపడిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఇటీవల ఇలాంటి వీడియోలు ఎక్కువయ్యాయి. ఇలాంటి స్టంట్స్ చేసి సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే హీరోలు అయినవారూ ఉన్నారు. అచ్చం ఇలానే ఓ యువకుడు బైక్‌‌పై ఇలాంటి సాహసమే చేయబోయి పట్టుతప్పి కిందపడ్డాడు. బైక్‌ను వేగంగా నడుపుతూ దానిపై నిల్చునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పట్టుతప్పడంతో కిందపడ్డాడు. దీంతో అతడి తల రోడ్డును బలంగా తాకింది. అయితే, కొద్దిపాటి గాయాలతో పెద్ద ప్రమాదం నుంచి అతడు బయటపడడంతో నెటిజన్లు ఊపిరి పీల్చుకున్నారు. 


చత్తీస్‌గఢ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి దీపాన్షు కబ్రా ఈ నెల 25న ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఆ తర్వాత కాసేపటికే అది వైరల్ అయింది. ‘‘ఇలాగే మీ పిల్లలకు, స్నేహితులకు జరిగితే చూసి తట్టుకోగలరా. అయితే, ఇలాంటి తెలివితక్కువ పనులు చేయకుండా వారిని వారించండి. సేఫ్టీకి ప్రాధాన్యమివ్వాలని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని వారికి చెప్పండి’’ అని ఆయన రాసుకొచ్చారు.  

Updated Date - 2021-03-28T02:38:08+05:30 IST