Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రేమకోసం లింగ మార్పిడి చేసుకున్న యువకుడు.. జమాల్ నుంచి శిల్పగా మారాడు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

ప్రేమ కోసం ఎన్నో త్యాగాలు చేసిన ప్రేమికుల కథలు మనం చూసుంటాం కానీ ఒక వ్యక్తి తన ప్రేమ కోసం తన పురుషత్వాన్నే వదులుకున్నాడు. బహుశా ఇలా జరగడం ఇంతకుముందు ఎక్కడా జరిగి ఉండకపోవచ్చు. కానీ అంత త్యాగం చేసినా చివరికి నిరాశే మిగిలింది. అలాంటి వారిని సమాజం ఎలాగూ గౌరవించదు.. కానీ తాను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి అయినా తనను స్వీకరిచాడా? లేదా? అన్నది.. జమాల్ అలియాస్ శిల్ప కథ.


16 ఏళ్ల క్రితం కోల్‌కతా నుంచి ముంబై వచ్చి స్థిరపడ్డాడు జమాల్ షేక్(31). ఏడాదిన్నర క్రితం అతనికి ఫుర్‌ఖాన్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి ముంబై అంగా షికార్లు కొట్టేవాడు. కొద్దికాలం తరువాత ఫుర్‌ఖాన్ అంటే జమాల్‌కి ఇష్టం ఏర్పడింది. అతనితోనే ఎక్కువ సమయం గడిపేవాడు. ఫుర్‌ఖాన్‌కు చాలా సార్లు డబ్బు అవసరం ఉంటే జమాల్ సహాయం చేసేవాడు. 


అలా కొంత కాలం గడిచాక జమాల్ తన మనసులో మాట ఫుర్‌ఖాన్‌తో చెప్పాడు. ఫుర్‌ఖాన్‌ని ప్రేమిస్తున్నట్లు అంగీకరించాడు. తన మనసులో అతడి స్థానం చాలా ప్రత్యేకమన్నాడు. జమాల్ ఒక పురుషుడై ఉండి మరో పురుషుడిని ప్రేమిస్తున్నానని చెప్పడంతో ఫుర్‌ఖాన్ ఖంగుతిన్నాడు. కానీ జమాల్ చూపే అప్యాయతకు దాసోహమయ్యాడు. 


ఫుర్‌ఖాన్ కూడా జమాల్‌ ప్రేమని అంగీకరించాడు. కానీ జమాల్ లింగమార్పిడి చేసుకుంటే వివాహం చేసుకుంటానని ఫుర్‌ఖాన్ చెప్పగా.. అందుకు జమాల్ సరేనన్నాడు. అలా ఫుర్‌ఖాన్ ప్రేమకోసం జమాల్ రూ.2 లక్షలు వెచ్చించి లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. జమాల్ నుంచి శిల్ప అని పేరు మార్చుకున్నాడు. ఈ విషయం తెలిసిన జమాల్ తల్లిదండ్రులు అతడిని స్వీకరించలేదు. 


అపరేషన్ చేసుకున్నాక ఫుర్‌ఖాన్‌ని కలిసేందుకు శిల్ప వెళ్లగా.. అతను కనబడలేదు. ఎంత వెతికినా అతను దొరకలేదు. చివరికి ఫుర్‌ఖాన్ ఢిల్లీకి  వెళ్లాడని తెలిసింది. తనకు చెప్పకుండా ఎక్కడికి వెళ్లాడని.. ఫుర్‌ఖాన్ గురించి ఆరా తీయగా.. అతనకి ఇంతకుందే వివాహమైందని తెలిసింది. 


ఫుర్‌ఖాన్ తనను మోసం చేసి పారిపోయాడని తెలిసి శిల్ప చాలా బాధపడింది. చివరికి అతడిపై ఫిర్యాదు చేసేందుకు పోలీసుల వద్దకు వెళ్లినా.. వారు కేసు నమోదు చేయడం లేదని అవేదన వ్యక్తం చేసింది.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement