Abn logo
Jan 2 2021 @ 10:09AM

న్యూ ఇయర్ పార్టీ కోసం అప్పు.. వైరల్ అవుతున్న ప్రామిసరీ నోట్!

ఇంటర్నెట్ డెస్క్: కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరికీ స్పెషలే. డిసెంబరు 31 రాత్రి తెగ హంగామా చేస్తుంటారు. ఈ పార్టీ కోసం తెగ ఖర్చు పెడుతుంటారు. వేలకు వేలు ఖాళీ చేస్తుంటారు. కొందరు పూటుగా మందు కొట్టి రోడ్లపై రైరై అని తిరుగుతుంటారు. దీనికోసం ముందుగానే డబ్బు రెడీ చేసుకుంటుంటారు. అయితే అలా రెడీ చేసుకోని వారు ఏం చేస్తారు..? అప్పు చేస్తారు. వేలల్లో అప్పు తీసుకుని పార్టీ చేసుకుంటారు. అలా అప్పు తీసుకున్న ఓ వ్యక్తికి సంబంధించిన ఓ ప్రామిసరీ నోటు ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో స్పష్టంగా ‘31స్ట్ నైట్ దావత్ కోసం రూ.15000’ అని రాసి ఉంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.


Advertisement
Advertisement