భర్త ఆయుష్షు కోసం భార్య ఉపవాసం.. స్నానం చేసి వచ్చి తడి టవల్ ఆరేయబోయిన భర్త.. అంతలోనే ఊహించని దారుణం

ABN , First Publish Date - 2021-10-27T06:01:51+05:30 IST

విద్యుదాఘాతానికి గురైన ఓ యువకుడిని కుటుంబసభ్యులు డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్ అతను చనిపోయినట్లు..

భర్త ఆయుష్షు కోసం భార్య ఉపవాసం.. స్నానం చేసి వచ్చి తడి టవల్ ఆరేయబోయిన భర్త.. అంతలోనే ఊహించని దారుణం

చండీఘర్: విద్యుదాఘాతానికి గురైన ఓ యువకుడిని కుటుంబసభ్యులు డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్ అతను చనిపోయినట్లు ప్రకటించాడు. కానీ యువకుడి కుటుంబ సభ్యులు ఆ యువకుడి మరణాన్ని అంగీకరించలేకోయారు. అప్పుడో ఎవరో వారికి ఓ పనికిమాలిన సలహా ఇచ్చారు. 6 నుంచి 7 గంటల పాటు ఆవు పేడలో పాతిపెట్టడం వల్ల కరెంట్ ప్రభావం తగ్గి యువకుడు బతికుతాడని ఎవరో బంధువులు చెప్పడంతో.. కుటుంబసభ్యులంతా కలిసి సమీపంలోని రైతు ఇంట్లో ఉంచిన ఆవు పేడలో యువకుడి మృతదేహాన్ని పూడ్చారు. ఆ తర్వాత బయటకు తీసి హర్యానాలోని సిర్సా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. 


వివరాల్లోకి వెళితే.. స్థానిక మండి కలాన్‌వలీలోని దేవ్‌లీలా పార్క్ సమీపంలో 32 ఏళ్ల జగ్జీత్ సింగ్ నివశిస్తున్నాడు. అతడు దేసు రోడ్డులోని ఓ ప్రైవేట్ ల్యాబ్‌లో పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం స్నానం చేసి తన ఇంట్లోని బాత్‌రూమ్‌ నుంచి బయటకు వచ్చాడు. అక్కడే ఉన్న తీగపై తడి టవల్ ఆరేయబోయాడు. అయితే తీగకు కరెంట్ ప్రవహించడంతో అతిడికి షాక్ తగిలింది. విద్యుదాఘాతానికి గురైన అతడికి కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు మరణించినట్లు ధృవీకరించడంతో తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. ఎవరో చెప్పారని మృతదేహాన్ని ఆవు పేడలో పూడ్చి పెట్టారు. ఆ తర్వాత బయటకు తీసి స్వచ్ఛమైన నేతితో మర్దనా చేశారు. శరీరంలో ఏదో చలనం అనిపించేసరికి వెంటనే మళ్లీ ఆసుపత్రికి తీసుకళ్లారు. కానీ.. డాక్టర్లు మాత్రం అతడు చనిపోయి చాలా సేపయిందని చెప్పడంతో మృతదేహాన్ని బాధగా తిరిగి తీసుకొచ్చారు. మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో అంత్యక్రియలు నిర్వహించారు.


మృతుడికి భార్య, 4ఏళ్ల కొడుకు ఉన్నారు. కర్వాచౌత్ రోజున భర్త చనిపోవడంతో భార్య ఆరోగ్యం క్షీణించింది. కానీ ఆమె ఉపవాసం గురించే తలుచుకుంటూ మెడిసిన్ కూడా తీసుకోలేదు. దీంతో ఆమె ఆరోగ్యం కూడా క్షీణించింది. తన భర్త కోసమే ఉపవాస దీక్ష చేస్తుంటే తన కళ్ల ముందే భర్త చనిపోయాడని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. 


Updated Date - 2021-10-27T06:01:51+05:30 IST