ఫేస్ మసాజర్‌లో.. 20 లక్షల విలువైన బంగారం!

ABN , First Publish Date - 2021-04-01T11:43:19+05:30 IST

స్మగ్లింగ్ చేసే వాళ్లు రకరకాల విధానాల్లో తమ కార్యకలాపాలు చేస్తుంటారు. ఇలా చేయడం కోసం కొత్త కొత్త ప్రక్రియలను కనుక్కుంటూ ఉంటారు. ఇప్పుడు తాజాగా ఓ స్మగ్లర్.. ఫేస్ మసాజర్‌లో రూ.20లక్షల విలువైన బంగారం పెట్టుకొని దొరికిపోయాడు.

ఫేస్ మసాజర్‌లో.. 20 లక్షల విలువైన బంగారం!

జైపూర్: స్మగ్లింగ్ చేసే వాళ్లు రకరకాల విధానాల్లో తమ కార్యకలాపాలు చేస్తుంటారు. ఇలా చేయడం కోసం కొత్త కొత్త ప్రక్రియలను కనుక్కుంటూ ఉంటారు. ఇప్పుడు తాజాగా ఓ స్మగ్లర్.. ఫేస్ మసాజర్‌లో రూ.20లక్షల విలువైన బంగారం పెట్టుకొని దొరికిపోయాడు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో వెలుగు చూసింది. సదరు ప్రయాణికుడిని తనిఖీ చేసిన కస్టమ్స్ అధికారులకు అతని ఫేస్‌మసాజర్లో 436 గ్రాముల బంగారం లభించింది. ఫేస్‌ మసాజర్‌తోపాటు చిన్న పోర్టబుల్ స్పీకర్‌లోని గుండ్రని అయస్కాంతంలో కూడా బంగారాన్ని దాచాడు. ఫిబ్రవరి నెలలో కూడా జైపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఇలాంటి ఘటనే జరిగింది. షూలో రూ.70 లక్షల విలువైన బంగారాన్ని పెట్టుకొని స్మగ్లింగ్ చేస్తున్న ఒక ప్రయాణికుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2021-04-01T11:43:19+05:30 IST