Advertisement
Advertisement
Abn logo
Advertisement

Viral Video: గుడ్లతో ఈ వ్యక్తి ఇలా చేశాడేంటి!

ఇంటర్నెట్ డెస్క్: ఓ వ్యక్తి అరచేతి వేనుక భాగంపై ఎక్కువ మొత్తంలో గుడ్లను బ్యాలెన్స్ చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో ప్రస్తుతం అతడికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో స్పందిస్తున్న నెటిజన్లు.. ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్ చేస్తున్నారు. 


సాధారణంగా కోడి గుడ్డంత సైజులో ఉండే.. గుడ్లను అరచేతిలో ఐదుకు మించి పట్టుకోలేం కదా. అయితే ఇరాక్‌కు చెందిన ఇబ్రహీం అనే యువకుడు మాత్రం.. అరచేతి వెనుక భాగంతో ఏకంగా 18 గుడ్లను బ్యాలెన్స్ చేసి ఔరా! అనిపించాడు. అంతేకాకుండా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో గిన్నీస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు.. అందుకు సంబంధించిన వీడియోను తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ప్రస్తుతం అదికాస్తా వైరల్‌గా మారింది. 




Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement