బీకాం యువతి.. జాబ్ ప్రయత్నాల్లో ప్రియుడు.. భార్యాభర్తలమని చెప్పి సిటీలో అద్దె ఇంట్లో కాపురం.. మూడేళ్ల తర్వాత..

ABN , First Publish Date - 2021-11-17T11:32:24+05:30 IST

కాలేజీలో చదువుకునే సమయం నుంచి అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఆ తరువాత ఇద్దరూ సహజీవనం కూడా చేశారు. చదువు పూర్తికాగానే ఆ ప్రేమికుడు ఆమెను పెళ్లి చేసుకోవడానకి నిరాకరించాడు. అప్పుడ ఆ యువతి తనని ప్రేమికుడు మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సమస్యను ఆ పోలీసులు ఎలా పరిష్కరించారంటే..

బీకాం యువతి.. జాబ్ ప్రయత్నాల్లో ప్రియుడు.. భార్యాభర్తలమని చెప్పి సిటీలో అద్దె ఇంట్లో కాపురం.. మూడేళ్ల తర్వాత..

కాలేజీలో చదువుకునే సమయం నుంచి అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఆ తరువాత ఇద్దరూ సహజీవనం కూడా చేశారు. చదువు పూర్తికాగానే ఆ ప్రేమికుడు ఆమెను పెళ్లి చేసుకోవడానకి నిరాకరించాడు. అప్పుడ ఆ యువతి తనని ప్రేమికుడు మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సమస్యను ఆ పోలీసులు ఎలా పరిష్కరించారంటే?..


బీహార్ రాష్ట్ర రాజధాని పట్నాలో అంకుశ్ అనే కుర్రాడు 2019లో బిఏ చదువుకోవడానికి కాలేజీలో చేరాడు. ఆ సమయంలోనే దివ్య(పేరు మార్చబడినది) బి.కాం చదువుకోవడానికి తన గ్రామం వదిలి పట్నాలోని కాలేజీలో చేరింది. ఇద్దరికీ సాయంత్రం వేళ లైబ్రరీలో పుస్తకాలు చదివే అలవాలు ఉంది. అలా లైబ్రరీ రోజూ ఒకరినొకరు చూస్తూ పలకరించుకొనేవారు. ఆ పలకరింపులు కాస్త ఇష్టంగా మారాయి. ఇద్దరూ కలిసి జీవించాలనుకొన్నారు. ఇంకా చదువు పూర్తికాలేదు కాబట్టి ఇంట్లో ఒప్పుకోరు అందుకని సహజీవనం చేయాలనుకొని నిర్ణయించుకున్నారు.


వారిద్దరూ భార్యభర్తలమని చెప్పి ఒక ఇంట్లో అద్దెకు దిగారు. అంకుశ్ చదువుతోపాటు ఉద్యోగం కోసం పోటీ పరీక్షలు కూడా రాసేవాడు. అలా వారిద్దరూ మూడేళ్లపాటు తమ చదువుని పూర్తిచేశారు. అదే సమయంలో అంకుశ్ బీహార్ పోలీస్‌గా ఉద్యోగం సంపాదించాడు. దీంతో దివ్య సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. ఇక తామిద్దరం పెళ్లిచేసుకొని సుఖంగా జీవితం గడపవచ్చుననుకొని సంతోషపడింది. కానీ అంకుశ్ అప్పుడే పెళ్లి వద్దునని చెప్పాడు. కానీ దివ్య పెళ్లిచేసుకోవడానికి ఇదే సరైన సమయంగా భావించింది. అంకుశ్ మాత్రం ఎంత చెప్పినా పెళ్లికి అంగీకరించలేదు. పెళ్లి మాటెత్తగానే ఏదో ఒక వంక పెట్టి తప్పించుకొనేవాడు. 


దీంతో దివ్య మహిళా పోలీస్ స్టేషన్‌లో అంకుశ్‌పై ఫిర్యాదు చేసింది. తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని చెప్పింది. పోలీసులు అంకుశ్‌ని పిలిపించి విచారణ చేశారు. అతడికి 

కౌన్సిలింగ్ ఇప్పించారు. దివ్యతో పెళ్లికి తన ఇంట్లో ఒప్పుకోవడం లేదని... వారు ఒప్పుకుంటే తనకేం అభ్యంతరం లేదని అంకుశ్ పోలీసులతో అన్నాడు. ఆ తరువాత పోలీసులు అంకుశ్ ఇంటివారికి కబురు పంపించారు. అంకుశ్‌కి తండ్రి లేకపోవడంతో అతని తల్లి, అన్నతో జరిగింది చెప్పి వారిని పెళ్లికి ఒప్పించారు.


మరోవైపు దివ్య ఇంట్లో వాళ్లని కూడా పిలిచారు, కానీ వారు ఈ పెళ్లికి తమ అంగీకారం తెలుపలేదు. అలా పోలీసులు అంకుశ్, దివ్య కేసుని ఒక కొలిక్కి తీసుకువచ్చారు.


Updated Date - 2021-11-17T11:32:24+05:30 IST