Abn logo
Jun 28 2021 @ 11:19AM

మహిళపై అత్యాచారం... యువకుడి అరెస్ట్

బారాబంకీ (ఉత్తరప్రదేశ్): ఓ మహిళపై అత్యాచారం చేసి, పెళ్లి అనంతరం మతమార్పిడి చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బారాబంకీ పట్టణంలో జరిగింది. బారాబంకీ ప్రాంతానికి చెందిన ఓ రైతు వద్ద వహాబ్ అనే యువకుడు తన పేరు దేశరాజ్ గౌతమ్ అని తప్పుడు గుర్తింపుతో పనిచేశాడు. రైతు కుమార్తెను పరిచయం చేసుకొని జూన్ 20వతేదీన ఆమెను తీసుకొని పారిపోయాడు. తన కుమార్తెను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లి అత్యాచారం జరిపి, దాన్ని చిత్రీకరించి ఆమెను బలవంతంగా మతమార్పిడి చేశాడని మహిళ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో పోలీసులు కిడ్నాప్, అత్యాచారం కింద కేసు నమోదు చేశారు. మహిళకు వైద్యపరీక్షలకు తరలించారు. వైద్యపరీక్షల నివేదిక రాగానే నిందితుడిపై తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.