మూత్ర విసర్జనకు అని వెళ్లి.. మద్యం మత్తులో డ్రెయినేజీలో పడి మృతి

ABN , First Publish Date - 2020-07-14T22:31:16+05:30 IST

మద్యం మత్తులో డ్రెయినేజీలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారంరాత్రి నగరంలో జరిగింది. అర్బన్‌ పోలీసుల కథనం ప్రకారం..

మూత్ర విసర్జనకు అని వెళ్లి.. మద్యం మత్తులో డ్రెయినేజీలో పడి మృతి

ఖమ్మం (ఆంధ్రజ్యోతి): మద్యం మత్తులో డ్రెయినేజీలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారంరాత్రి నగరంలో జరిగింది. అర్బన్‌ పోలీసుల కథనం ప్రకారం.. నేలకొండపల్లి మండలం మోటాపురం గ్రామానికి చెందిన తాళ్లపల్లి రవి(37) హైదరాబాదులోని బండ్లగూడ మునిసిపల్‌ ఆఫీసులో కాంట్రాక్ట్‌ వర్కర్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం సెలవు కావడంతో స్వగ్రామానికి వచ్చాడు. రవి నగరంలోని బాలాజీనగర్‌లో ఉండే తోడల్లుడు కందుల ఉపేందర్‌ ఇంటికి వెళ్లాడు. తిరిగి సాయంత్రం ఆరుగంటల సమయంలో స్వగ్రామం వెళుతూ ఖానాపురం యూపీహెచ్‌కాలనీలో రోడ్డుపక్కన మూత్రవిసర్జన చేసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు డ్రెయినేజీలో పడిపోయాడు రాత్రి సమయం కావడంతో ఎవరు గమనించలేదు. అప్పటికే మద్యం మత్తులో ఉండడంతో మృతిచెందాడు. సోమవారం ఉదయం స్థానికులు చూసి అర్బన్‌ పోలీసులకు సమాచారం అందించారు.  

Updated Date - 2020-07-14T22:31:16+05:30 IST