వాంతులు, విరేచనాలతో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-01-15T09:20:13+05:30 IST

వాంతులు, విరేచనాలకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు.

వాంతులు, విరేచనాలతో వ్యక్తి మృతి

కొవిడ్‌ వ్యాక్సిన్‌ వల్లేనని కుటుంబ సభ్యుల ఆరోపణ

ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ కారణం కావొచ్చు : వైద్యాధికారి 

తాండూరు రూరల్‌, జనవరి 14 : వాంతులు, విరేచనాలకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ రెండో డోసు తీసుకోవడం వల్లే మరణించాడంటూ కుటుంబసభ్యులు ఆరోపించారు. వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలం ఉద్దండాపూర్‌కు చెందిన బురుదొడ్డి చిన్నచంద్రప్ప గురువారం రెండో డోసు తీసుకున్నాడు. అదే రోజు  వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. వ్యాక్సిన్‌ వల్లే ఇలా జరిగిందని కుటుంబసభ్యులు ఆరోపించారు. వైద్యాధికారి అపూర్వను వివరణ కోరగా.. ఊపిరితిత్తు ల్లో ఇన్ఫెక్షన్‌ వల్ల చిన్నచంద్రప్ప మృతిచెంది ఉండొచ్చని తెలిపారు. 

Updated Date - 2022-01-15T09:20:13+05:30 IST