ఊపిరందక ఇబ్బంది.. 18 ఆస్పత్రులు చికిత్సకు నిరాకరించడంతో..

ABN , First Publish Date - 2020-06-30T22:19:24+05:30 IST

ఊపిరి తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తికి చికిత్స చేయడానికి 18 ఆస్పత్రులు నిరాకరించాయి.

ఊపిరందక ఇబ్బంది.. 18 ఆస్పత్రులు చికిత్సకు నిరాకరించడంతో..

బెంగళూరు: ఊపిరి తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తికి చికిత్స చేయడానికి 18 ఆస్పత్రులు నిరాకరించాయి. చివరకు ఓ ఆస్పత్రిలో చేరినా సరే ప్రయోజనం లేకపోయింది. ఆ వ్యక్తి చికిత్స ప్రారంభించిన కాసేపటికే మృతిచెందాడు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది. సదరు వ్యక్తి దాదాపు 24గంటలపాటు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు పడ్డాడని, కానీ అతనికి చికిత్స చేయడానికి 18 ఆస్పత్రులు నిరాకరించాయని మృతుడి కుటుంబం ఆరోపిస్తోంది. చివరకు ఓ ఆస్పత్రిలో చేర్చుకొని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. కాసేపటికే అతను మృతిచెందినట్లు తెలుస్తోంది. మృతుడికి కరోనా టెస్టులు నిర్వహించడం కోసం అధికారులు శాంపిల్స్ సేకరించారు.

Updated Date - 2020-06-30T22:19:24+05:30 IST