ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ వికటించి బ్రెజిల్‌లో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2020-10-22T08:22:25+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సిన్‌ క్లినికల్‌ పరీక్షల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కొవిడ్‌ వ్యాక్సిన్‌ వికటించి ఓ వలంటీరు...

ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ వికటించి బ్రెజిల్‌లో వ్యక్తి మృతి

బ్రెజిల్‌, అక్టోబరు 21: కొవిడ్‌ వ్యాక్సిన్‌ క్లినికల్‌ పరీక్షల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కొవిడ్‌ వ్యాక్సిన్‌ వికటించి ఓ వలంటీరు మృతి చెందారు. ఈ విషయంపై దర్యాప్తు జరుపుతున్నట్లు బుధవారం బ్రెజిల్‌ ఆరోగ్య సంస్థ అన్విసా తెలిపింది. వలంటీరు మృతి చెందిన తర్వాత కూడా వ్యాక్సిన్‌ పరీక్షలు కొనసాగనున్నాయని పేర్కొంది. బ్రెజిల్‌లో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ మూడో దశ క్లినికల్‌ పరీక్షల సమన్వయకర్తగా ఉన్న ఫెడరల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సావోపాలో కూడా వ్యాక్సిన్‌ తీసుకున్న వలంటీరు మరణించినట్లు తెలిపింది.

Updated Date - 2020-10-22T08:22:25+05:30 IST