America: నింజాలా మారి ఆర్మీ అధికారులపైనే దాడి.. ఎలా పట్టుకున్నారంటే..

ABN , First Publish Date - 2021-10-03T07:14:31+05:30 IST

అర్థరాత్రి 1:20 సమయంలో క్యాలిఫోర్నియా పోలీసులకు ఓ కాల్ వచ్చింది. ఎవరో వ్యక్తి నింజా డ్రెస్‌లో కటానా(జపాన్‌ సాంప్రదాయ ఖడ్గం) పట్టుకుని ఎయిర్‌పోర్ట్ రోడ్ పార్కింగ్ లాట్‌లో తిరుగుతున్నాడని, అతడు ఓ వ్యక్తిపై దాడి చేసినట్లు కూడా అవతలి వ్యక్తులు పోలీసులకు తెలిపారు. మరో 20 నిముషాల్లో మరో కాల్ వచ్చింది.

America: నింజాలా మారి ఆర్మీ అధికారులపైనే దాడి.. ఎలా పట్టుకున్నారంటే..

వాషింగ్టన్: జపాన్‌లో నింజాలకు బాగా క్రేజ్. ఇంగ్లీష్ జేమ్స్ బాండ్ ఎలాగో జపాన్‌లో నింజాలు కూడా అలాగే. అంతా సీక్రెట్ ఆపరేషన్లు, శతృవును ఆశ్చర్యపరిచే యుద్ధ నైపుణ్యం.. నింజాల సొంతం. అయితే నింజాలకు జపాన్‌లోనే కాదు.. అమెరికాలో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా అలాంటి ఓ ఫ్యాన్ అమెరికన్ ఆర్మీ అధికారులకే భారీ షాకిచ్చాడు. చివరికి ఎలాగోలా అతడిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే గత నెలలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు శనివారం వెల్లడించారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అర్థరాత్రి 1:20 సమయంలో క్యాలిఫోర్నియా పోలీసులకు ఓ కాల్ వచ్చింది.  ఎవరో వ్యక్తి నింజా డ్రెస్‌లో కటానా(జపాన్‌ సాంప్రదాయ ఖడ్గం) పట్టుకుని ఎయిర్‌పోర్ట్ రోడ్ పార్కింగ్ లాట్‌లో తిరుగుతున్నాడని, అతడు ఓ వ్యక్తిపై దాడి చేసినట్లు కూడా అవతలి వ్యక్తులు పోలీసులకు తెలిపారు. మరో 20 నిముషాల్లో మరో కాల్ వచ్చింది. తమకు సాయం కావాలని, ఇప్పటివరకు ఎవరూ సాయానికి రాకపోవడం ఏంటని అవతలి వ్యక్తులు కోరారు.


కాగా.. క్యాలిఫోర్నియాలోని ఎయిర్‌పోర్ట్‌ రోడ్‌లో ఉన్న ఆర్మీ అధికారుల ట్రైనింగ్ సెంటర్‌ వద్ద ఓ 35 ఏళ్ల వ్యక్తి నింజా డ్రెస్‌లో తిరగడం ప్రారంభించారు. అదే సమయంలో సెంటర్ నుంచి పొగ తాగేందుకు బయటకు వచ్చిన ఓ అధికారిని ‘నేను ఎవరో తెలుసా..? నా భార్య పిల్లలు ఎక్కడున్నారు..?’ అంటూ సంబంధం లేని ప్రశ్నలడిగాడు. అయితే వాటికి అవతలి ఆర్మీ ట్రెయినీ తెలియదని సమాధానం చెప్పడంతో అతడిపై కటానాతో దాడి చేశాడు. అతడి మొబైల్‌ను పగలగొట్టి, మోకాలిపై వేటు వేశాడు. అతడి నుంచి తప్పించుకుని ఆ అధికారి లోనికి వెళ్లి దాక్కున్నాడు. అయినప్పటికీ ఆ వ్యక్తి రాళ్లు విసిరి అద్దాలు పగలగొట్టడంతో మరో అధికారికి కూడా గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే ఆర్మీ ట్రెయినింగ్ సెంటర్ నుంచి పోలీసులకు కాల్ వచ్చింది. అనంతరం అక్కడకు చేరుకున్న పోలీసులు నిందితుడిని నానా తంటాలు పడి ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి పట్టుకున్నారు.

Updated Date - 2021-10-03T07:14:31+05:30 IST