ప్రజలు మద్యం తాగి రావణుడిలా ప్రవర్తిస్తున్నారంటూ.. ఆ వ్యక్తి ఏం చేశాడో చూడండి..

ABN , First Publish Date - 2022-01-02T02:42:44+05:30 IST

సమాజ హితం కోసం చాలా మంది తమ జీవితాలను కూడా త్యాగం చేస్తుంటారు. ఇంకొందరు ఏదో ఒక రూపంలో సమాజానికి మంచి సందేశం ఇవ్వాలని ప్రయత్నిస్తుంటారు. నూతన సంవత్సరం రోజున పూణేలో ఓ వ్యక్తి..

ప్రజలు మద్యం తాగి రావణుడిలా ప్రవర్తిస్తున్నారంటూ.. ఆ వ్యక్తి ఏం చేశాడో చూడండి..

ఎదుటి మనిషిని ఎప్పుడెప్పుడు మోసం చేద్దామా.. అనుకునే మనుషులు ఉన్న ఈ సమాజంలో మంచి వాళ్లు కూడా ఎంతోమంది ఉంటారు. సమాజ హితం కోసం చాలా మంది తమ జీవితాలను కూడా త్యాగం చేస్తుంటారు. ఇంకొందరు ఏదో ఒక రూపంలో సమాజానికి మంచి సందేశం ఇవ్వాలని ప్రయత్నిస్తుంటారు. నూతన సంవత్సరం రోజున పూణేలో ఓ వ్యక్తి.. సమాజ హితం కోసం తన వంతు బాధ్యతగా వినూత్న పద్ధతిలో సందేశం ఇచ్చాడు.


న్యూ ఇయర్ వేడుకలంటేనే మద్యం ఏరులై పారుతుంటుంది. మందు తాగడమే వేడుక అనుకునే నేటి యువతకు, పూణేకు చెందిన అరుణ్ ఓహర్ అనే వ్యక్తి వినూత్న పద్ధతిలో సందేశం ఇచ్చాడు. నూతన సంవత్సరం సందర్భంగా శనివారం అతడు రావణుడి వేషధారణలో నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద పాల ప్యాకెట్లు పంచి పెట్టాడు. నూతన సంవత్సరం సందర్భంగా మద్యానికి స్వస్తి పలకాలని పిలుపునిచ్చాడు. ప్రజలు మద్యం తాగి రావణుడిలా ప్రవర్తిస్తున్నారని.. లోపలున్న రావడుడిని విడిచిపెట్టి మద్యానికి స్వస్తి చెప్పాలన్నాడు. అందుకే తాను రావణుడి వేషం వేసుకుని ప్రచారం చేస్తున్నట్లు వివరించాడు.

ప్లాస్టిక్ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. శిశువు ఆరోగ్యంగా ఉన్నా.. పరీక్షించిన వైద్యులు ఏమంటున్నారంటే..


మద్యానికి బానిసవడం ద్వారా కుటుంబం నాశనమవుతుందని తెలిపాడు. మందును వదిలి పాలు తీసుకోవడం అలవాటు చేసుకోవాలన్నాడు. అలాగే వేడుకల పేరుతో హంగామా చేయకుండా.. శాంతియుతంగా జరుపుకోవాలని ఆయన సూచించాడు. సమాజ హితం కోసం అరుణ్ ఓహర్ చేస్తున్న ప్రయత్నాన్ని నగరవాసులంతా అభినందించారు. ఈ సందర్భంగా పలువురు పోలీసులు, నాయకులు అరుణ్ ఓహర్‌ను ప్రశంసలతో ముంచెత్తారు.

ఆస్పత్రిలో అడ్మిట్ అయిన రోగితో నర్సు చాటింగ్.. ఓ రోజు ఫోన్‌లో ఆమె మాటలు విని..

Updated Date - 2022-01-02T02:42:44+05:30 IST