Abn logo
Oct 25 2021 @ 00:07AM

చెరువులో మునిగి వ్యక్తి మృతి

మృతదేహాన్ని బయటకు తెస్తున్న దృశ్యం

పద్మనాభం, అక్టోబరు 24: మండలంలోని పాండ్రంగి పంచాయతీ పరిధి మునివానిపాలెంలో చెరువులో మునిగి ఆదివారం ఓ యువకుడు మృతి చెందినట్టు పద్మనాభం పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం మునివానిపాలెంలోని నల్లోడి చెరువు గట్టుపై విద్యుత్‌ లైన్‌ పనులు చేస్తూ వైరును ఒక గట్టు నుంచి మరో గట్టుపైకి వేయడానికి బోని గ్రామానికి చెందిన మద్దిల శ్రీను (36) అనే వ్యక్తి నీటిలో దిగి వెళ్లాడు. మార్గ మధ్యంలో లోతు ఎక్కువగా ఉండడంతో ఈత రాక చెరువులో మునిగి చెందాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు స్థానికుల సహాయంతో మృతదేహాన్ని వెతికితీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.