Abn logo
Oct 1 2020 @ 08:04AM

అదృష్టం అంటే ఇతడిదేనేమో.. సెకన్ల వ్యవధిలో..

Kaakateeya

అబూధాబీ: సౌదీలో ఓ వ్యక్తికి భూమి మీద ఇంకా నూకలు మిగిలే ఉండటంతో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. అల్ ఖతానీ అనే వ్యక్తి కార్ వాషింగ్‌కు వెళ్లాడు. తన కారు వాషింగ్ అవుతుండటంతో అక్కడే ఓ కుర్చీలో కూర్చున్నాడు. ఇదే సమయంలో తన ముందు ఓ వ్యక్తి కారును రివర్స్ పార్కింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఎందుకన్నా మంచిదని అల్ ఖతానీ కుర్చీలో నుంచి లేచి పక్కకు వెళ్లాడు. అలా పక్కకు వెళ్లాడో లేదో సెకన్ల వ్యవధిలో కారు ఒక్కసారిగా వెనక్కు దూసుకొచ్చింది. అల్ ఖతానీ కనుక కుర్చీలోనే ఉండుంటే పరిస్థితి వేరే విధంగా ఉండేది. పైనున్న వీడియోలో ఈ ఘటనను స్పష్టంగా చూడవచ్చు. కారు డ్రైవర్ మీద అనుమానం రావడంతోనే తాను కుర్చీలో నుంచి లేచినట్టు అల్ ఖతానీ చెప్పాడు. ఇంతటి ప్రమాదం నుంచి బయటపడినందుకు ముందుగా దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని అల్ ఖతానీ అన్నాడు. 

Advertisement
Advertisement
Advertisement