రహస్య కెమెరాలతో.. 1400 అసభ్య వీడియోలు తీసిన వ్యక్తి!

ABN , First Publish Date - 2020-06-06T23:13:48+05:30 IST

రహస్య కెమెరాలతో సుమారు 1400 మంది మహిళలు, పిల్లల అసభ్య వీడియోలు తీసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

రహస్య కెమెరాలతో.. 1400 అసభ్య వీడియోలు తీసిన వ్యక్తి!

సింగపూర్: రహస్య కెమెరాలతో సుమారు 1400 మంది మహిళలు, పిల్లల అసభ్య వీడియోలు తీసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతనికి 27 నెలల జైలుశిక్ష విధిస్తున్నట్లు కోర్టు తీర్పునిచ్చింది. ఈ ఘటన సింగపూర్‌లో జరిగింది. ఈ వీడియోలు తీయడానికి స్పై వాచ్‌లు, పెన్ కెమెరాలు, మొబైల్స్ వాడినట్లు తెలుస్తోంది. సదరు వ్యక్తి వయసు 35 ఏళ్లని, అతను బస్సులు, ట్రైన్లలో వెళ్తున్న మహిళల అసభ్య ఫొటోలు కూడా తీశాడని అధికారులు చెప్పారు. అలాగే బాత్రూం, స్నానాల గదిలో మహిళలు, చిన్న పిల్లలు ఉన్న వీడియోలు కూడా తీసినట్లు తెలిపారు. ఇలా దాదాపు 800 సందర్భాల్లో అతను వీడియోలు తీసినట్లు అధికారులు పేర్కొన్నారు. అతనిపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరు పరచగా.. నిందితుడికి రెండు సంవత్సరాల మూడు నెలల జైలు శిక్ష విధిస్తున్నట్లు కోర్టు తీర్పిచ్చింది.

Updated Date - 2020-06-06T23:13:48+05:30 IST