సముద్రం ఒడ్డున సేద తీరుతున్నాడో వ్యక్తి.. దూరంగా నీటిపై తేలుతూ కనిపించిన ప్యాకెట్లు.. రూ.7.5 కోట్ల విలువ చేసే..

ABN , First Publish Date - 2021-12-11T00:14:16+05:30 IST

సముద్రం ఒడ్డున సేద తీరుతున్నాడో వ్యక్తి.. దూరంగా నీటిపై ఏదో తేలుతున్నట్టు అతడికి కనిపించింది. వాటి దగ్గరకెళ్లి చూస్తే.. తెల్లగా ఉన్న ప్యాకెట్లని అతడికి అర్థమైంది. ఒకటి కాదు.. రెండు కాదు.. పదుల సంఖ్యలో ఉన్న పాకెట్లు!

సముద్రం ఒడ్డున సేద తీరుతున్నాడో వ్యక్తి.. దూరంగా నీటిపై తేలుతూ కనిపించిన ప్యాకెట్లు.. రూ.7.5 కోట్ల విలువ చేసే..

ఇంటర్నెట్ డెస్క్: సముద్రం ఒడ్డున సేద తీరుతున్నాడో వ్యక్తి.. దూరంగా నీటిపై ఏదో తేలుతున్నట్టు అతడికి కనిపించింది. వాటి దగ్గరకు వెళ్లి చూస్తే..అవి తెల్లగా ఉన్న ప్యాకెట్లని అతడికి అర్థమైంది. ఒకటి కాదు.. రెండు  కాదు.. పదుల సంఖ్యలో ఉన్నాయి! ఎవరో వాటిని కవర్లలో చుట్టి సముద్రంలో పడేసినట్టు అతడికి అనిపించింది. ఇదంతా చూడగానే అనుమానం కలిగింది. అయితే.. అందరిలాగే అతడు ఈ గొడవంతా మనకెందుకులే అనుకుని వెళ్లిపోలేదు. ఓ పౌరుడిగా తన బాధ్యతను నిర్వర్తించాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అమెరికా కోస్ట్ గార్డుకు(తీరప్రాంత రక్షణ దళం) సమాచారం అందించాడు.


కోస్ట్ గార్డు వచ్చి ఆ పాక్యట్లు చెక్ చేసి షాకైపోయారు. అతడు అనుమానిస్తున్నదే నిజమని చెప్పారు.  ఆ ప్యాకెట్లలో ఉన్నది దాదాపు 30 కిలోలు కొకైన్ అని తేల్చారు. మార్కెట్‌లో విక్రయించగలిగితే ఎంత లేదన్నా ఒక మిలియన్ డాలర్లు వస్తాయన్న అధికారుల మాట విని అతడు షాకైపోయాడు. మన కరెన్సీలో చెప్పుకోవాలంటే.. ఇది దాదాపు 7.5 కోట్ల రూపాలయకు సమానం. కాగా.. కోస్ట్ గార్డు అధికారులు అతడిని అభినందించారు. ‘ఓ పౌరుడిగా నీ బాధ్యత నిర్వహించావు’ అంటూ పొగడ్తలో ముంచెత్తారు. అంతేకాదు.. అతడి గురించి ట్విటర్‌లో కూడా పేర్కొన్నారు. అమెరికాలో ఫ్లోరిడా రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఉదంతం ఇది. పోలీసుల ప్రశంసలకు పాత్రుడైన అతడిని నెటిజన్లు కూడా పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. 



Updated Date - 2021-12-11T00:14:16+05:30 IST