Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఫేస్‌బుక్‌లో యువతి పరిచయం.. ఫోన్‌కాల్స్ దాకా వచ్చిన యవ్వారం.. రెండేళ్ల తర్వాత ఆమెను చూసిన అతడికి మైండ్‌బ్లాక్..

చెన్నై: ఇంటర్నెట్ ప్రస్తుతం దాదాపు అందరికీ అందుబాటులోకి వచ్చింది. దీంతో చాలా మంది దాన్ని విరివిగా వాడేస్తున్నారు. సోషల్ మీడియాలో ఖాతాలు తెరిచేస్తూ.. అపరిచితులను కూడా స్నేహితుల జాబితాలో చేర్చుకుంటున్నారు. ఈ కోవకే చెందిన ఓ వ్యక్తి.. సోషల్ మీడియాలో ఓ ప్రొఫైల్ చూసి ముచ్చటపడ్డాడు. ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి.. స్నేహితుల జాబితాలో చేరిపోయాడు. అనంతరం వారి మధ్య పరిచయం పెరిగి.. యవ్వారం ఫోన్ కాల్స్ వరకు వచ్చింది. ఈ క్రమంలోనే ఓ రోజు తన ఫేస్‌బుక్ స్నేహితురాలిని కలిసేందుకు ఆ వ్యక్తి ఇంటి నుంచి ఆశగా బయల్దేరాడు. తీరా అక్కడకు వెళ్లిన తర్వాత ఒక్కసారిగా షాక్ తిన్నాడు. రెండేళ్ల తర్వాత ఆమెను చూసిన అతడికి మైండ్ బ్లాక్ అయింది. పూర్తి వివరాల్లోకి వెళితే..


తమిళనాడులోని మేళా ఎరల్ ప్రాంతానికి చెందిన మురుగన్ అనే వ్యక్తి 10 తరగతి వరకు చదువుకున్నాడు. అనంతరం చదువు మానేసి.. తండ్రికి సాయంగా వ్యవసాయపనులు చేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే మురుగన్ ఫేస్‌బుక్‌లో అకౌంట్ ఓపెన్ చేశాడు. అందులో ఓ ప్రొఫైల్‌ చూసి, అవతలి వారికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. అవతలి వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇద్దరి మధ్య ఫేస్‌బుక్ స్నేహం మొదలైంది. కాలక్రమంలో వారిద్దరూ మరింత దగ్గరయ్యారు. వారి పరిచయం ఫోన్ సంభాషణల వరకూ వెళ్లింది. ఈ క్రమంలోనే రెండేళ్ల తర్వాత ఫేస్‌బుక్ స్నేహితురాలిని కలిసిందేకు మురుగన్ ఇంటి నుంచి ఉత్సాహంగా బయల్దేరాడు. తీరా అక్కడకున్న తర్వాత మురుగన్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇంతకాలం తాను స్నేహితురాలిగా భావించింది.. ఓ యువకుడిని అని తెలుసుకుని అతడి మైండ్ బ్లాక్ అయింది. ఎం.మురుగున్ అనే వ్యక్తి..తనతో ఇంతకాలం గొంతుమార్చి మహిళగా మాట్లాడినట్లు తెలుసుకుని మురుగన్ కంగుతిన్నాడు. 


కాగా.. ఈ వ్యవహారం అంతా మురుగన్ మృతితో వెలుగులోకి వచ్చింది. సెప్టెంబర్ 15న చెట్ల పొదల్లో మురుగన్ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. తొలుత ఆత్మహత్యగా భావించారు. అయితే పోస్ట్‌మార్టం రిపోర్టులో మురుగన్‌ది ఆత్మహత్య కాదని హత్య అని తేలడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మురుగన్ కాల్ రికార్డును పరిశీలించిన పోలీసులు.. రెండేళ్లుగా ఎం. మురుగన్ అనే వ్యక్తితో మాట్లాడుతున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు.. సెప్టెంబర్ 14న మురుగన్ ఓ వ్యక్తితో కలిసి ఉన్నట్లు గుర్తించారు. సెప్టెంబర్ 14న మురుగన్‌తో ఉన్న వ్యక్తి.. ఎం. మురుగనే కావొచ్చనే అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో ఎం. మురుగన్ విస్తుపోయే నిజాలను వెల్లడించాడు. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన మురుగన్‌ను మహిళగా నటించి, ట్రాప్ చేసినట్లు చెప్పాడు. అంతేకాకుండా తనతో శృంగారంలో పాల్గొనాలంటూ మురుగన్‌పై ఒత్తిడి తెచ్చినట్లు వెల్లడించాడు. దీంతో మురుగన్ తనను పక్కన పెట్టినట్లు చెప్పాడు. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన నగ్న ఫొటోలు ఉన్నాయంటూ మురుగన్‌ను బెదిరించినట్లు ఎం. మురుగన్ వెల్లడించాడు. దీంతో తనను కలిసేందుకు వచ్చిన మురుగన్‌కు పానీయంలో విషం కలిపి ఇచ్చి, ఆ తర్వాత బండరాయితో తలపై బాది హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. 


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement