Abn logo
Sep 23 2021 @ 14:23PM

Viral Video: కరోనా వ్యాక్సిన్ కేంద్రం వద్ద ఓ కుర్రాడి నిర్వాకం.. వీడియోను చూసి పంచ్‌లు పేలుస్తున్న నెటిజన్లు

ప్రపంచవ్యాప్తంగా విధ్వంసం సృ‌ష్టించిన కరోనాను ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ ఒక్కటే అందుబాటులో ఉన్న ఆయుధం. దీంతో అన్ని దేశాలు తమ పౌరులకు వ్యాక్సిన్ అందిస్తున్నాయి. భారత్‌లో కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం భారీ ఎత్తున జరుగుతోంది. కరోనా భయంతో చాలా మంది వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. కొందరు మాత్రం వ్యాక్సిన్ అంటే భయపడుతున్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 



ఎర్ర చొక్కా ధరించిన ఓ వ్యక్తిని అతని స్నేహితులు బలవంతంగా వ్యాక్సినేషన్ సెంటర్ వద్దకు తీసుకొచ్చారు. అయితే వ్యాక్సిన్ అంటే భయం వల్ల ఆ యువకుడు వ్యాక్సిన్ వేసుకోవడానికి ఇష్టపడలేదు. అయినా అతడి స్నేహితులు వదలలేదు. బలవంతంగా నర్సు దగ్గరకు తీసుకెళ్లారు. తోపులాటలో భాగంగా ఆ యువకుడు కిందపడిపోయినా స్నేహితులు ఒప్పుకోలేదు. అలా కింద పడుక్కోబెట్టే వ్యాక్సిన్ వేయించారు. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. 

ప్రత్యేకంమరిన్ని...