మతిమరుపు ఖరీదు రూ.1753కోట్లు.. కళ్లముందున్నా..

ABN , First Publish Date - 2021-01-14T21:00:02+05:30 IST

మతిమరుపు సహజంగా అందరికి ఉంటుంది. హడావిడిగా ఉన్న సమయంలో చేతిలో ఉన్న వస్తువులను ఒక చోట పెట్టి మరచిపోవడం, ఆ తరువాత వేరేచోట వెదకడం సాధారణంగా జరిగే విషయమే. కానీ ఇలాంటి మతిమరుపు వల్ల..

మతిమరుపు ఖరీదు రూ.1753కోట్లు.. కళ్లముందున్నా..

ఇంటర్నెట్ డెస్క్: మతిమరుపు సహజంగా అందరికి ఉంటుంది. హడావిడిగా ఉన్న సమయంలో చేతిలో ఉన్న వస్తువులను ఒక చోట పెట్టి మరచిపోవడం, ఆ తరువాత వేరేచోట వెదకడం సాధారణంగా జరిగే విషయమే. కానీ ఇలాంటి మతిమరుపు వల్ల మీరు భారీగా నష్టపోవచ్చు. అలా మతిమరుపు కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఓ వ్యక్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మతిమరుపు కారణంగా కోటీశ్వరుడయ్యే అవకాశాన్ని అతడు చేజేతులా పోగొట్టుకున్నాడు. కోట్ల రూపాయలు కళ్లముందున్నా తీసుకోలేని పరిస్థితికి చేరుకున్నాడు.  స్టీఫెన్ ధామస్ ప్రోగ్రామర్‌ అమెరికాలో వాషింగ్టన్‌ నివశిస్తున్నాడు. ఎప్పుడో డిజిటల్ కరెన్సీ అయిన బిట్‌కాయిన్ ధర చాలా తక్కువగా ఉన్నప్పుడు 7000 బిట్ కాయిన్స్ కొలుగోలు చేశాడు. వాటి భద్రంగా స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌తో బద్రపరిచాడు.


ఈ మధ్య కాలంలో బిట్ కాయిన్ రూ.25 లక్షలు పైగానే పలికింది. దాంతో అతడి మొత్తం కాయిన్స్ విలువ ఒక్కసారిగా రూ.1753 కోట్లకు పెరిగింది. అంటే అతడు కోటీశ్వరుడు అయిపోయాడన్నమాట. ఒక్కసారిగా ఇంత లక్ వచ్చి పడడంతో థామస్ ఆనందానికి హద్దు లేకుండా పోయింది. అయితే ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. తన ఖాతాకు పెట్టిన పాస్‌వర్డ్ మర్చిపోయాడు.


పాస్ వర్డ్ లేకపోవడంతో ఒక్క రూపాయి కూడా తీసుకోలేని పరిస్థితికి చేరుకున్నాడు. సరైన పాస్‌వర్డ్ కొట్టేందుకు 10 చాన్స్‌లు ఉంటాయి. అయితే అందులో 8 చాన్స్‌లను ఇప్పటికే వినియోగించేశాడు. ఇక మిగిలింది 2 చాన్సులే. ఈ రెండు సార్లు కూడా తప్పుగా కొడితే ఆ ఖాతా శాశ్వతంగా బంద్ అయిపోతుంది. అతడి కోట్ల సంపదతో పాటు కోటీశ్వరుడు కావాలనుకున్న అతడి కల కూడా ఆవిరైపోతుంది.

Updated Date - 2021-01-14T21:00:02+05:30 IST