భార్యా, భర్త మధ్యలో ఆమె లవర్.. బెదిరించమని పంపితే.. దారుణం

ABN , First Publish Date - 2021-10-19T12:21:19+05:30 IST

మధ్యప్రదేశ్‌లోని ఇందోర్ నగరంలో అక్టోబర్ 13న ఉదయం నడి రోడ్డుపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఒక బిపిఓ ఉద్యోగిని కత్తితో పొడిచి చంపారు. సంఘటన జరిగిన కొద్దిసేపటికే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు...

భార్యా, భర్త మధ్యలో ఆమె లవర్.. బెదిరించమని పంపితే.. దారుణం

మధ్యప్రదేశ్‌లోని ఇందోర్ నగరంలో అక్టోబర్ 13న ఉదయం నడి రోడ్డుపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఒక బిపిఓ ఉద్యోగిని కత్తితో పొడిచి చంపారు. సంఘటన జరిగిన కొద్దిసేపటికే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి జేబు నుంచి ఆధార్ కార్డ్ వివరాలు సేకరించి కేసు విచారణ మొదలుపెట్టారు. ఆ విచారణలో అనుకోని నిజాలు తెలిశాయి. 


ఇందోర్ నగరానికి చెందిన ఆకాష్ ఒక బిపిఓ ఉద్యోగి. ఒకటిన్నర సంవత్సరం కిందటే ఆకాష్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆకాష్ భార్య మోనా ఒక ఆస్పత్రిలో హెచ్ ఆర్ విభాగంలో పనిచేస్తోంది. ఒక రోజు ఆకాష్ తన భార్య మోనాని ఆస్పత్రి వెళ్లడానికి బస్టాప్ వద్ద వదిలి ఇంటికి వస్తుండగా దారిలో ఇద్దరు దుండగలు అతడిపై దాడి చేశారు. ఆకాష్ కళ్లో మిర్చి పొడి చల్లి అతడిని కత్తితో పొడిచారు. దాంతో ఆకాష్ అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు ఆకాష్ వద్ద దొరికిన ఆధార్ కార్డ్, సీసీటీవి వీడియో ఆధారంగా విచారణ మెుదలు పెట్టారు.


ఆకాష్ భార్య మోనాకు పోలీసులు సమాచారమందించారు. పోలీసులు ఈ హత్య కేసు వెనుక డబ్బు సంబంధించి లావాదేవీ వ్యవహారం ఉండొచ్చని అనుమానించారు. సీసీటీవి వీడియో ఆధారంగా దుండగలు వచ్చిన బైకు నెంబర్ తెలుసుకొని వారి గాలించారు. ఇందోర్ నగర పరిసరాల్లో ఉన్న అన్ని టోల్ ప్లాజా సీసీటీవి వీడియోలను వెతికి చివరికి ఆ దుండగలు సమీపంలోని ఒక గ్రామంలో ఉన్నట్లు తెలుసుకొని పట్టుకున్నారు.


పోలీసులు ఆ ఇద్దరు నిందితులను విచారణ చేయగా.. వారు కేవలం ఆకాష్‌ను బెదించడానకి అక్కడికి వెళ్లామని.. కానీ ఆకాష్ వారిని ఎదిరించడంతో అతడిని అనుకోకుండా కత్తితో పొడవాల్సి వచ్చిందని చెప్పారు. ఆకాష్‌ని బెదిరించడానికి వారిని మనీష్ శర్మ అనే ఒక డాక్టర్ డబ్బులిచ్చాడని పోలీసులకు చెప్పారు. పోలీసులు నగరంలో దేవాస్ ఆస్పత్రిలో పనిచేసే డాక్టర్ మనీష్ శర్మ కోసం ఆస్పత్రికి వెళ్లగా మనీష్ కొన్ని రోజులుగా సెలవుపై రాజస్థాన్ వెళ్లాడని తెలిసింది. డాక్టర్ మనీష్ గురించి పోలీసులు విచారణ చేయగా.. అతనరి తోటి మహిళా ఉద్యోగులతో సంబంధాలున్నట్లు తేలింది.


ఆస్పత్రిలో పోలీసులకు మరో విషయం అనుకోకుండా తెలిసింది. అదే ఆస్పత్రిలో మృతుడు ఆకాష్ భార్య మోనా పనిచేస్తున్నట్లు విచారణలో తేలింది. పోలీసులకు మోనాపై అనుమానం వచ్చింది. మోనా ఫోన్ కాల్ రికార్డ్స్ చెక్ చేశారు. మోనా చాలా కాలంగా డాక్టర్ మనీష్‌తో ఫోన్లో మాట్లాడుతున్నట్లు పోలీసులు తెలుకున్నారు. దీంతో పోలీసులు తీగ లాగితే డొంక కదిలింది. మోనాకు డాక్టర్ మనీష్‌తో వివాహేతర సంబంధం ఉందని తేలింది. దీంతో పోలీసులు మోనాను అరెస్టు చేశారు. ఆమెను పోలీసులు గట్టిగా విచారణ చేయడంతో నిజం ఒప్పుకుంది.


పోలీసుల కథనం ప్రకారం.. ఆకాష్‌తో మోనా ప్రేమ వివాహం చేసుకున్న కొద్ది కాలానికి ఆస్పత్రిలో కొత్తగా డాక్టర్ మనీష్ వచ్చాడు. ఆ తరువాత డాక్టర్ మనీష్‌ మోనా ప్రేమింకున్నారు. కొద్ది కాలం తరువాత ఆకాష్‌కు ఈ విషయం తెలిసి మోనాను కొట్టాడు. డాక్టర్ మనీష్ వద్దకు వెళ్లి ఒక తన భార్య జోలికి రావొద్దని హెచ్చరించాడు. దీంతో మోనా ఎలాగైనా ఆకాష్‌ను వదిలించుకోవాలనుకుంది. డాక్టర్ మనీష్‌తో కలిసి ఆకాష్‌ను భయపెట్టాలని ప్లాన్ వేసింది. 


డాక్టర్ మనీష్ తనకు తెలిసిన ఇద్దరు కిరాయి రౌడీలను ఆకాష్‌ను బెదిరించమని పంపాడు. వారు అక్టోబర్ 13న ఆకాష్ ఒంటరిగా ఉన్న సమయంలో అతడిపై దాడి చేసి బెదరించబోగా.. ఆకాష్ వారిద్దరినీ ఎదిరించడంతో ఆ రౌడీలు ఆకాష్‌ను కత్తితో పొడిచేశారు. దాంతో ఆకాష్ అక్కడికక్కడే మ‌ృతి చెందాడు. ప్రస్తుతం డాక్టర్ మనీష్ పరారీలో ఉన్నాడు. పోలీసులు మోనా, డాక్టర్ మనీష్‌పై హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు.



Updated Date - 2021-10-19T12:21:19+05:30 IST