Abn logo
Jul 22 2021 @ 01:31AM

130 ట్విటర్ ఖాతాలు హ్యాక్.. జాబితాలో ఒబామా, బిల్ గేట్స్, ఎలన్ మస్క్..!

మాడ్రిడ్: ప్రముఖులను టార్గెట్ చేసి వారి ట్విటర్ ఖాతాలను హ్యాక్ చేస్తున్న ఒక బ్రిటన్ పౌరుడిని ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టెస్లా సీఈవో ఎలన్ మస్క్, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, వాల్‌స్ట్రీట్ దిగ్గజం వారెన్ బఫెట్ తదితర ప్రముఖుల ట్విటర్ ఖాతాలను హ్యాక్ చేసిన జోసెఫ్ ఓ కానర్ అనే వ్యక్తి స్పెయిన్‌లో పోలీసుల చేతికి చిక్కాడు. వీటితోపాటు ఒక జువైనల్ అమ్మాయిని సైబర్ స్టాకింగ్ (ఆన్‌లైన్‌లో వెంటపడటం) కేసులో కూడా అతనిపై ఆరోపణలు ఉన్నట్లు యూఎస్ జస్టిస్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. సదరు నిందితుడు ప్రముఖుల ట్విటర్ ఖాతాలను హ్యాక్ చేసి, ఒక క్రిప్టోకరెన్సీ కుంభకోణాన్ని ప్రచారం చేశాడని సమాచారం.