Viral Video: శునకాన్ని వేధిస్తూ వికృత చేష్టలకు పాల్పడుతున్న యువకుడికి తగిన శాస్తి చేసిన ఆవు..

ABN , First Publish Date - 2021-11-01T22:38:54+05:30 IST

ప్రస్తుతం నెట్టింట ఓ వీడియో వైరల్‌గా మారింది. అందులోని దృశ్యాల ప్రకారం.. శునకాన్ని వేధిస్తూ ఓ వ్యక్తి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఆ బాధను భరించలేక శునకం అరవడం ప్రారంభించింది. మనుషులెవరూ ఆ వ్యక్తిని ఆపే ప్రయత్నం చేయకపోగా.. సెల్‌ఫో

Viral Video: శునకాన్ని వేధిస్తూ వికృత చేష్టలకు పాల్పడుతున్న యువకుడికి తగిన శాస్తి చేసిన ఆవు..

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం నెట్టింట ఓ వీడియో వైరల్‌గా మారింది. అందులోని దృశ్యాల ప్రకారం.. శునకాన్ని వేధిస్తూ ఓ వ్యక్తి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఆ బాధను భరించలేక శునకం అరవడం ప్రారంభించింది. మనుషులెవరూ ఆ వ్యక్తిని ఆపే ప్రయత్నం చేయకపోగా.. సెల్‌ఫోన్‌లకు పని చెప్పారు. అతడిని శాడిజాన్ని రికార్డు చేయడం ప్రారంభించారు. అయితే అక్కడే ఉన్న ఆవు.. దీనంతటినీ గమనించి షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది. కాగా.. ఇంతకూ ఏం జరిగింది అనే పూర్తి వివరాల్లోకి వెళితే..


మనుషులు అప్పుడప్పుడు విచక్షణ కోల్పోతూ ఉంటారు. ఆ సమయంలో వారు ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో వారికే తెలియదు. ఈ కోవకే చెందిన ఓ వ్యక్తి.. తాజాగా దారుణానికి పాల్పడ్డాడు. మూగజీవం అని కూడా చూడకుండా ఓ శునకంపై తన ప్రతాపం చూపించాడు. శునకం చెవులను పట్టుకుని దాన్ని పైకి లేపి, నేలపై బలంగా కొట్టడం ప్రారంభించాడు. అతడు చేసే పనిని అందరూ వేడుకలా చూశారు. మనుషుల ప్రాణాలు పోతుంటేనే పట్టించుకోము అలాంటి ఓ కుక్క బాధపడితే రియాక్ట్ కావాలా అన్నట్లు ప్రవర్తించారు. సెల్‌ఫోన్‌లలో కెమెరాను ఓపెన్ చేసి, ఆ దృశ్యాలను వీడియో తీయడం ప్రారంభించారు.



అయితే.. దీన్నంతటినీ అక్కడే దూరంగా ఉండి గమనిస్తున్న ఓ ఆవు మాత్రం.. మనుషుల్లా చూస్తూ ఊరుకోలేదు. సాటిమూగ జీవికి సాయం చేయలన్న తపనతో పరెగెత్తుకొచ్చింది. కొమ్ములతో శునకాన్ని అతడి చేతుల నుంచి విడిపించింది. అనంతరం అతడిని కుమ్మేసింది. కాగా.. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్ నందా ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా ప్రస్తుతం అదికాస్తా వైరల్‌గా మారింది. ఇప్పటి వరకూ ఈ వీడియోను 1.29లక్షల మంది వీక్షించారు. 






Updated Date - 2021-11-01T22:38:54+05:30 IST