బంగ్లాదేశ్ అమ్మాయిల అక్రమ రవాణ...నిందితుడి అరెస్ట్

ABN , First Publish Date - 2021-01-07T13:49:06+05:30 IST

బంగ్లాదేశ్‌కు చెందిన ఇద్దరు అమ్మాయిలతో వ్యభిచారం చేయించేందుకు అక్రమంగా బెంగళూరుకు తరలిస్తుండగా...

బంగ్లాదేశ్ అమ్మాయిల అక్రమ రవాణ...నిందితుడి అరెస్ట్

కోల్‌కతా (పశ్చిమ బెంగాల్): బంగ్లాదేశ్‌కు చెందిన ఇద్దరు అమ్మాయిలతో వ్యభిచారం చేయించేందుకు అక్రమంగా బెంగళూరుకు తరలిస్తుండగా కోల్‌కతా విమానాశ్రయంలో ఐక్యరాజ్యసమితి చిల్డ్రన్సు ఫండ్ (యునిసెఫ్) లోని పిల్లల రక్షణ విభాగంలో పనిచేస్తున్న ఒక అధికారి పట్టుకున్నారు. యునిసెఫ్ అధికారి గార్గి సాహా ఫిర్యాదు మేర బంగ్లాదేశ్ అమ్మాయిలను అక్రమంగా తరలిస్తున్న రోఫికుల్ ఇస్లాం అనే నిందితుడిని విమానాశ్రయం భద్రతా సిబ్బంది అరెస్టు చేశారు.బంగ్లాదేశ్ కు చెందిన ఇద్దరు అమ్మాయిలు ఓ మగ వ్యక్తితో కలిసి కోల్ కతా నుంచి ఇండిగో విమానంలో  బెంగళూరుకు బయలుదేరగా యునిసెఫ్ అధికారి గార్గిసాహా గుర్తించారు. యునిసెఫ్ అధికారి ఫిర్యాదు మేర నిందితుడు రోఫికుల్ ఇస్లాంను అరెస్టు చేసి ఇద్దరు అమ్మాయిలను కాపాడారు.


ఇద్దరు అమ్మాయిలు బంగ్లాదేశీయులని, వారు సరిహద్దు ల మీదుగా భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించారని భద్రతా సిబ్బంది దర్యాప్తులో తేలింది. ఇద్దరు అమ్మాయిలు రోఫికుల్ ఇస్లాంతో కలిసి బెంగళూరు  వెళ్లేందుకు ఇష్టపడలేదని విమానాశ్రయ భద్రతా అధికారి చెప్పారు. అనంతరం ముగ్గురిని కోల్ కతా విమానాశ్రయ పోలీసులకు అప్పగించారు. బెంగళూరులో వ్యభిచారం నిర్వహించేందుకు బంగ్లాదేశ్ అమ్మాయిలను అక్రమంగా తీసుకువచ్చారా అనే విషయంపై కోల్ కతా పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. 

Updated Date - 2021-01-07T13:49:06+05:30 IST