పెళ్లి పేరిట 12 మంది మహిళలపై ఇంజినీర్ లైంగిక వేధింపులు

ABN , First Publish Date - 2021-06-08T15:21:34+05:30 IST

మ్యాట్రిమోనియల్ సైట్ లను ఉపయోగించి పెళ్లి పేరిట యువతులను ఆకర్షించి వారిని లైంగికంగా వేధించిన మెకానికల్ ఇంజినీరును ముంబై పోలీసులు కటకటాల్లోకి నెట్టారు....

పెళ్లి పేరిట 12 మంది మహిళలపై ఇంజినీర్ లైంగిక వేధింపులు

ముంబై (మహారాష్ట్ర): మ్యాట్రిమోనియల్ సైట్ లను ఉపయోగించి పెళ్లి పేరిట యువతులను ఆకర్షించి వారిని లైంగికంగా వేధించిన మెకానికల్ ఇంజినీరును ముంబై పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 12 మంది యువతులను లైంగికంగా వేధించిన మహేష్ అలియాస్ కరణ్ గుప్తాను పోలీసులు అరెస్టు చేశారు. ముంబైలోని మలాడ్ ప్రాంతానికి చెందిన మహేష్ ఉన్నత విద్యావంతులైన యువతులను ఆకర్షించేందుకు మ్యాట్రిమోనియల్ సైట్లలో నకిలీ ప్రొఫైల్ లను సృష్టించాడు. మ్యాట్రిమోనియల్ సైట్ల ద్వారా యువతులతో సన్నిహితంగా మెలుగుతూ వారిని ఫోన్లలో సంప్రదించి పబ్, రెస్టారెంట్లు,షాపింగ్ మాల్స్ లలో సమావేశం అయ్యేవాడు. 


ఈ సమావేశాల్లో యువతులను లైంగికంగా వేధించాడని డిప్యూటీ పోలీసు కమిషనర్ సురేష్ మెన్ గేడ్ చెప్పారు. ప్రతీ నేరానికి కొత్త మొబైల్ నంబరును ఉపయోగించాడు. ప్రతీసారి తన సిమ్ ను మార్చుకుంటూ ఓలా లేదా ఉబెర్ ఉపయోగించి క్యాబ్రైడ్లను బుక్ చేసేవాడు. గతంలో హ్యాకర్ గా పనిచేసిన మహేష్ కంప్యూటర్లపై మంచి పరిజ్ఞానం ఉంది. పెద్ద కంపెనీల్లో పనిచేసిన మహేష్ 12 మంది మహిళలను లైంగికంగా వేధించాడు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించామని డీసీపీ చెప్పారు. 

Updated Date - 2021-06-08T15:21:34+05:30 IST