పూజ చేసి.. నదిలో దూకి.. కృష్ణా నదిలో వృద్ధుడి గల్లంతు

ABN , First Publish Date - 2020-09-22T08:38:46+05:30 IST

కృష్ణమ్మకు పూజ చేసుకొంటాను అని చెప్పి... తీరా నది వద్దకు వచ్చిన తరువాత అమాంతం నదిలోకి దూకి ఓ వృద్ధుడు గల్లంతైన ఘటన తా

పూజ చేసి.. నదిలో దూకి.. కృష్ణా నదిలో వృద్ధుడి గల్లంతు

తాడేపల్లి టౌన్(ఆంధ్రజ్యోతి): కృష్ణమ్మకు పూజ చేసుకొంటాను అని చెప్పి... తీరా నది వద్దకు వచ్చిన తరువాత అమాంతం నదిలోకి దూకి  ఓ వృద్ధుడు గల్లంతైన ఘటన తాడేపల్లి పట్టణంలోని కనకదుర్గమ్మ వారధి వద్ద సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  విజయవాడకు సమీపంలోని తాడిగడపకు చెందిన మన్నే దుర్గాప్రసాద్‌(65) అవివాహితుడు.


సోమవారం కృష్ణమ్మకు పూజ చేసుకోవాలంటూ, తన తమ్ముడి కొడుకు సుజిత్‌ను వెంట పెట్టుకొని కనకదుర్గమ్మ వారధి దగ్గరకు వచ్చాడు. తన దగ్గర ఉన్న మొబైల్‌, ఓ లెటర్‌ ఇచ్చి.. తాను పూజ చేసుకొంటాను వీడియో తీయమని చెప్పాడు. సుజిత్‌ వీడియో తీస్తుండగానే.. ఉన్నట్టుండి ఒక్కసారిగా దుర్గాప్రసాద్‌ నదిలో దూకేశాడు. ఒక్కసారిగా షాక్‌కు గురైన సుజిత్‌ వారధి ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌లో పోలీసులకు సమాచారం ఇచ్చాడు.


వరద ఉధృతి ఎక్కువుగా ఉండడంతో అప్పటికే దుర్గాప్రసాద్‌ కొట్టుకుపోయాడు. తన చావుకు ఎవరు బాధ్యులు కాదు.. అనారోగ్యంతో చనిపోతున్నాను.. అని లేఖలో పేర్కొన్నాడు. గల్లంతైన వృద్ధుని కోసం తాడేపల్లి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Updated Date - 2020-09-22T08:38:46+05:30 IST