హోలీ వేడుకలో వివాదం... వ్యక్తి హత్య!

ABN , First Publish Date - 2021-03-30T15:24:20+05:30 IST

యూపీలోని వారణాసి పరిధిలోగల బరాయీ గ్రామంలో...

హోలీ వేడుకలో వివాదం... వ్యక్తి హత్య!

చౌబెపూర్: యూపీలోని వారణాసి పరిధిలోగల బరాయీ గ్రామంలో హోలీ సందర్భంగా రంగులు చల్లడంలో వివాదం చెలరేగి, రాజూరాజ్ భర్(35) అనే వ్యక్తి హత్యకు దారితీసింది. ఈ ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం హోలీ నాడు మధ్యాహ్నం రంగులు జల్లుకునే వేడుక జరుగుతోంది. ఇంటిముందు కోలాహలం నెలకొందని రాజూరాజ్ భర్ భార్య అతనితో చెప్పింది. దీంతో రాజు బయటకు వచ్చి వారిని మందలించాడు. దీంతో ఆగ్రహించిన వారు అతనిపై దాడి చేశారు. ఈ దాడిలో రాజురాజ్ భర్ హతమవగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-03-30T15:24:20+05:30 IST