Advertisement
Advertisement
Abn logo
Advertisement

కుమార్తె love marriage చేసుకుందని కసాయి తండ్రి ఏం చేశాడంటే...

 భోపాల్ (మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ జిల్లాలో దారుణం జరిగింది. భోపాల్ జిల్లాలోని రాతిబాద్‌గ్రామంలో 55 ఏళ్ల వ్యక్తి కుమార్తె వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కోపంతో కన్నతండ్రే కసాయిగా మారాడు.వావివరసలు లేకుండా, కసాయిగా మారిన తండ్రి కన్న కుమార్తెపై అత్యాచారం చేసి చంపిన ఘటన సంచలనం రేపింది.సెహోర్ జిల్లాలోని బిల్కిస్‌గంజ్‌కు చెందిన ఓ యువతి తన తల్లిదండ్రులను కాదని ఇంట్లో నుంచి పారిపోయి వేరే యువకుడిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకుంది. కుమార్తె కులాంతర వివాహం చేసుకోవడంతో అతని కుటుంబాన్ని సమాజం అవహేళన చేసింది. 

కులాంతర వివాహం చేసుకున్న కుమార్తెకు బిడ్డ పుట్టడంతో శిశువును తీసుకొని దీపావళి పండుగకు తన అక్క ఇంటికి వచ్చింది. అక్క ఇంట్లో శిశువు అనారోగ్యంతో మరణించింది. అక్క చెప్పడంతో శిశువు అంత్యక్రియల కోసం తండ్రి కొడుకుతో కలిసి రాతిబాద్ గ్రామానికి వచ్చాడు.శిశువు మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు తండ్రి కుమార్తెను తీసుకొని అడవికి వెళ్లాడు. అడవిలో ఏడాది క్రితం జరిగిన కులాంతర వివాహంపై తండ్రీకూతుళ్ల మధ్య వాగ్వాదం జరిగింది. 


దీంతో తండ్రి కసాయిగా మారి కన్న కుమార్తెపైనే అత్యాచారం చేసి, ఆపై ఆమె గొంతు కోసి హత్య చేశాడు.అనంతరం సమస్‌గడ్ అడవుల్లో రెండు రోజుల క్రితం మహిళ, శిశువు మృతదేహాలు పోలీసులకు లభించాయి. నిందితుడైన కసాయి తండ్రి తన నేరాన్ని అంగీకరించడంతో అతనిపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302, 376 లకింద పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశారు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement