తమ్ముడి భార్యను కత్తితో నరికిన అన్న.. అసలు కారణమేంటంటే..

ABN , First Publish Date - 2020-08-14T21:16:56+05:30 IST

మణుగూరులో ఈనెల 8న జరిగిన హత్యకేసును పోలీసులు చేధించారు. వాటాల పంపక వివాదమే ఈ ఘటనకు కారణమని పోలీసులు పేర్కొన్నారు. గురువారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు స్టేషన్‌లో నిందితుడిని మీడియాకు

తమ్ముడి భార్యను కత్తితో నరికిన అన్న.. అసలు కారణమేంటంటే..

వాటాల పంపక వివాదమే హత్యకు కారణం

హాబీబా హత్యకేసులో నిదింతుడి అరెస్టు

వివరాలు వెల్లడించిన పోలీసులు


మణుగూరు (ఖమ్మం): మణుగూరులో ఈనెల 8న జరిగిన హత్యకేసును పోలీసులు చేధించారు. వాటాల పంపక వివాదమే ఈ ఘటనకు కారణమని పోలీసులు పేర్కొన్నారు. గురువారం నిందితుడిని   అదుపులోకి తీసుకున్నారు. పోలీసు స్టేషన్‌లో నిందితుడిని మీడియాకు చూపుతూ వివరాలు తెలిపారు. మణుగూరు పట్టణానికి చెందిన ఇబ్రహీం ఈ హత్య చేశాడన్న విషయం తమ విచారణలో రుజువైందని మణుగూరు సీఐ సుకూర్‌ తెలిపారు.  ఇబ్రహీం తల్లి దాచుకున్న సొమ్ము ఆమె తదనంతరం తన చిన్న సోదరుడైన  మెహాబూబాషాషా ఎకౌంట్‌లో జమైంది.  ఎనిమిది లక్షలు రాగా, వాటిని తల్లి ఆశించిన విధంగా అన్నదమ్ములు నలుగురు రెండేసి లక్షల చొప్పున పంచుకోవాలని అనుకున్నారు.


అయితే ఇందులో ఇబ్రహీం తనకు నాలుగు లక్షలు కావాలని కుటుంబ సభ్యులతో గొడవలు పడుతుండేవాడు. ఈ క్రమంలోనే తమ్ముడు మెహాబూబాషాషా భార్య హాబీబాతో పలుమార్లు  వాగ్వాదం జరిగింది. ఈ విషయాన్ని మనసులోపెట్టుకున్న ఇబ్రహీం పధకం ప్రకారం.. ఈ నెల 8న మంచినీళ్లను పంపు నుంచి ఇంటికి తిరిగి వెలుతుండగా ఇబ్రహీం కత్తితో వెనుక నుంచి వచ్చి ఆమె మెడను నరికాడు. హాబీబా అక్కడికక్కడే మృతిచెందింది. ఇబ్రహీం కత్తిని చెత్తలో పడేసి పారిపోయాడు. డాగ్‌ స్కాడ్‌ద్వారా నిదింతుడు ఆచూకీని ప్రాథమికంగా కనుగొన్నామన్నారు. హాబీబాపై దాడిచేసిన అనంతరం ఇబ్రహీం పరారి అయ్యాడన్నారు. అప్పటినుంచి కర్ణాటకలో తలదాచుకుని తిరిగి ఛతీతగఢ్‌ వెళ్లేందుకు గురువారం ప్రయత్నిస్తుండగా ఇబ్రహీంను చింతల బయ్యారం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిదింతున్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో మణుగూరు ఎస్‌ఐ నరేష్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-08-14T21:16:56+05:30 IST