Abn logo
Jul 29 2020 @ 18:05PM

జీవన సహచరి అక్రమ సంబంధం పెట్టుకుందని హత్య

పూణే (మహారాష్ట్ర) :  నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్న మహిళ మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఆమెను చంపిన ఘటన మహారాష్ట్రలోని పూణే నగరంలో వెలుగుచూసింది. పూణే నగరంలోని షిరూర్ గ్రామానికి చెందిన సారిక సుదాం గిర్మాకర్ (30) దత్తాత్రేయ జేనుబావ్ గైక్వాడ్ (40) నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరికి గతంలో వివాహాలు అయినా వారు వదిలివేశారు. తన భర్తను వదిలిన సారిక...భార్యను వదిలి ఒంటరిగా ఉంటున్న దత్తాత్రేయతో కలిసి సహజీవనం సాగిస్తోంది. సరిత ప్రవర్తనపై అనుమానంతో ఆమెతో గొడవపడిన దత్తాత్రేయ జీవన సహచరిని హత్య చేశాడు. పోలీసులు ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

బీ కేర్ఫుల్మరిన్ని...

Advertisement
Advertisement