అత్తను పొట్టనపెట్టుకున్న అల్లుడు.. పొరుగింట్లో పెళ్ళికి వెళ్లిందని..

ABN , First Publish Date - 2021-04-03T23:59:48+05:30 IST

వద్దంటున్నా వినకుండా పొరగింట్లో పెళ్లికి వెళ్ళిన తన భార్య, అత్తపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అత్త మరణించగా భార్యకు గాయాలయ్యాయి.

అత్తను పొట్టనపెట్టుకున్న అల్లుడు.. పొరుగింట్లో పెళ్ళికి వెళ్లిందని..

ముంబై: వద్దంటున్నా వినకుండా పొరగింట్లో పెళ్లికి వెళ్ళిన తన భార్య, అత్తపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అత్త మరణించగా భార్యకు గాయాలయ్యాయి. మహారాష్ట్రలోని జల్నా జిల్లా బబ్లూతరా గ్రామంలో ఇటీవల ఈ దారుణం జరిగింది. భార్య, అత్త తన మాట పెడచెవినపెట్టినందుకు నిందితుడు సంతోష సరోదే తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడని స్థానిక పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో అతడు భార్య, ఆమె తల్లిపై వేట కొడవలితో దాడి చేశాడని పేర్కొన్నారు. అయితే..అత్తను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందిందని, భార్యకు గాయాలయ్యాయని వారు తెలిపారు. చనిపోయేముందు ఆమె ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదులోకి తీసుకున్నారు. 

Updated Date - 2021-04-03T23:59:48+05:30 IST