తల్లిదండ్రులను హతమార్చిన కిరాతకుడు.. కారణం తెలిసి తలలు పట్టుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2021-11-01T12:06:47+05:30 IST

ఏ మతంలోనైనా తల్లిదండ్రులంటే దేవుడితో సమానం అని అంటారు. మరి అలాంటి తల్లిదండ్రులను హత్య చేశాడు ఒక కిరాతక పుత్రుడు. ఈ సంఘటన రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో జరిగింది...

తల్లిదండ్రులను హతమార్చిన కిరాతకుడు.. కారణం తెలిసి తలలు పట్టుకున్న పోలీసులు

ఏ మతంలోనైనా తల్లిదండ్రులంటే దేవుడితో సమానం అని అంటారు. మరి అలాంటి తల్లిదండ్రులను హత్య చేశాడు ఒక కిరాతక పుత్రుడు.  ఈ సంఘటన రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో జరిగింది. పోలీసులు అతడిని అరెస్టు చేయగా.. షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.


జైపూర్‌కి చెందిన ఇబ్రహీం ఖాన్(68) గత శుక్రవారం అక్టోబర్ 29న తన ఇంట్లో శవమై రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఆయనను కలిసే దానికి పక్కింటి వారు ఇంటికి రావడంతో విషయం వెలుగు చూసింది. పోలీసులు విచారణలో భాగంగా ఇబ్రహీం ఖాన్ కొడుకు కుతుబుద్దీన్‌ని(40) ప్రశ్నించారు. అప్పుడతను తానే తండ్రిని తలపై పలుమార్లు కొట్టి చంపేశానని ఒప్పుకున్నాడు. దానికి కారణం తండ్రిని ఈ లోకం నుంచి విముక్తి కలిగించడమే అని అన్నాడు. పోలీసులకు అర్థం కాలేదు. తండ్రి ఇబ్రహీంని ఈ పాపపు లోకం నుంచి విముక్తి ప్రసాదించి జన్నత్(స్వర్గం)కు పంపించాల్సిందిగా తనకు అల్లా ఆదేశించాడని చెప్పాడు. అంతే కాదు ఆ తరువాత తన వదినను కూడా జన్నత్‌కు పంపించాల్సి ఉందని అన్నాడు. కుతుబుద్దీన్ చెప్పిన సమాధానాలు విన్న పోలీసులు.. ముందు అతని గురించి విచారణ చేశారు. అప్పుడు అతని అన్న, వదిన మిగతా కుటుంబ సభ్యులు అతడి గురించి చెప్పారు. 


పోలీసుల కథనం ప్రకారం.. కుతుబుద్దీన్ గత 17 ఏళ్ల నుంచి రోజూ 5 పూట్ల నమాజు చేస్తాడని తెలిసింది. ఆరు సంవత్సరాల క్రితం అతనికి వివాహం చేయగా.. కొద్ది కాలానికే భార్య గొడవపడి వెళ్లిపోయింది. ఇదిలా ఉండగా.. గత రంజాన్ నెలలో ఒకరోజు తన తల్లి తలపై కుతుబుద్దీన్ కర్రతో కొట్టాడని ఆమెను ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ చనిపోయిందని కుటుంబసభ్యులు విచారణలో తెలిపారు. ఈ విషయంలో పోలీసులు మళ్లీ కుతుబుద్దీన్‌ని ప్రశ్నించగా.. తల్లిని కూడా జన్నత్‌కు పంపించడానికే అలా చేశానని ఒప్పుకున్నాడు. ఆమె అనారోగ్యంతో బాధపడేదని, అది చూడలేకే ఆ పని చేశానని అంగీకరించాడు. త్వరలో తన వదినను జన్నత్‌కు పంపిస్తాననీ చెప్పాడు.


పోలీసులు అతడిని అరెస్టు చేసి విచారణ చేసే సమయంలో అతడు కొంచెం కూడా బెదిరిపోలేదని, అతడు చాలా కఠోర స్వభావం కలవాడని పోలీసులు అంటున్నారు.

Updated Date - 2021-11-01T12:06:47+05:30 IST