ఫేస్‌బుక్‌లో ఒక క్లిక్‌తో లక్షలు పోగొట్టుకున్న యువకుడు.. అదెలాగంటే?

ABN , First Publish Date - 2021-12-12T05:42:15+05:30 IST

ఒక యువకుడు ఫేస్‌బుక్‌పై రోజంతా కూర్చొని చాటింగ్ చేసేవాడు. ఒక రోజు సరదాగా అందులో వచ్చిన యాడ్ క్లిక్ చేశాడు. దాంతో అతడికి రోజూ ఫోన్ కాల్స్ వచ్చేవి. ఒక ప్రముఖ ఫైనాన్స్ కంపెనీ పేరు చెప్పి తక్కువ వడ్డీతో పది లక్షల లోన్ తీసుకోండి అని నమ్మబలికి చివరికి లోన్ మంజూరు కావాలంటే .. కొంత డబ్బు ఖర్చవుతుందని అతని దెగ్గర లక్షలు కాజేశారు...

ఫేస్‌బుక్‌లో ఒక క్లిక్‌తో లక్షలు పోగొట్టుకున్న యువకుడు.. అదెలాగంటే?

ఒక యువకుడు ఫేస్‌బుక్‌పై రోజంతా కూర్చొని చాటింగ్ చేసేవాడు. ఒక రోజు సరదాగా అందులో వచ్చిన యాడ్ క్లిక్ చేశాడు. దాంతో అతడికి రోజూ ఫోన్ కాల్స్ వచ్చేవి. ఒక ప్రముఖ ఫైనాన్స్ కంపెనీ పేరు చెప్పి తక్కువ వడ్డీతో పది లక్షల లోన్ తీసుకోండి అని నమ్మబలికి చివరికి లోన్ మంజూరు కావాలంటే .. కొంత డబ్బు ఖర్చవుతుందని అతని దెగ్గర లక్షలు కాజేశారుఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.


ఢిల్లీలోని దాబ్డీ ప్రాంతంలో రాజా సింగ్ అనే యువకుడు రోజూ లాగే ఫేస్‌బుక్‌లో చాటింగ్ చేస్తూ అందులో ఒక యాడ్ క్లికి్ చేశాడు. ఆ తరువాత నుంచి అతనికి రోజూ ఫోన్ కాల్స్ వచ్చేవి. ఫోన్ చేసిన వారు వేర్వేరు నెంబర్లతో కాల్ చేసి.. "బజాజ్ ఫైనాన్స్ నుంచి మాట్లాడుతున్నాం.. మీకు పది లక్షల లోన్ ఇప్పిస్తాం.. అది కూడా తక్కువ వడ్డీతో.. వెంటనే తీసుకోండి.. ష్యూర్టీ కూడా మేమే చూసుకుంటాం.. త్వరపడండి" అంటూ అతడికి రోజూ కాలే చేసేవారు. 


చివరికి రాజా సింగ్ లోన్ తీసుకుందాం అని నిర్ణయించుకొని.. వారికి కాల్ చేశాడు. లోన్ ఇప్పిస్తామని చెప్పినవారు.. రాజాసింగ్ చేత కొ్న్ని డాక్యుమెంట్లు, కాన్సెల్ చేసిన చెక్లపై సైన్ చేయించుకున్నారు. ఆ తరువాత అతడికి రూ.10 లక్షలు లోన్ కావాలంటే ష్యూరిటి ఇచ్చేవారికి కొంచెం డబ్బులివ్వాలని, ఇప్పటికే లోన్ ప్రాసెసింగ్ మొదలైందని చెప్పారు. అది నమ్మిన రాజా సింగ్ వారికి కొంత డబ్బు ఇచ్చాడు. ఆ తరువాత అసలు కథ మొదలైంది. 


రాజాసింగ్ లోన్ తీసేసుకున్నట్టు డాక్యుమెంట్లపై అతడి సైన్ తీసుకున్నామని.. వెంటనే రూ.10 లక్షల లోన్ కట్టమని లేకపోతే కేసు పెడతామని అతడిపై ఒత్తిడి చేసేవారు. అలా రాజాసింగ్ ఆ మోసగాళ్ల అకౌంట్‌లో రూ.3.11 లక్షలు డబ్బులు వేశాడు. ఇంకా డబ్బులు వేయమని రాజాసింగ్‌ను బ్లాక్ మెయిల్ చేస్తే.. చివరికి అతడు విసిగిపోయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జరిగినదంతా అక్కడ పోలీసులకు వివరించాడు. పోలీసులు ప్రస్తుతం చీటింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.


Updated Date - 2021-12-12T05:42:15+05:30 IST