పెళ్లి చూపుల కోసం కారు తీసుకొని అడిగితే బెదిరింపులు

ABN , First Publish Date - 2021-04-05T13:45:40+05:30 IST

పెళ్లి చూపుల కోసం కారు వాడుకుంటానని తీసుకొని తిరిగి ఇవ్వకుండా

పెళ్లి చూపుల కోసం కారు తీసుకొని అడిగితే బెదిరింపులు

హైదరాబాద్/బంజారాహిల్స్‌ : పెళ్లి చూపుల కోసం కారు వాడుకుంటానని తీసుకొని తిరిగి ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిపై బాధితుడు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కమలాపురికాలనీ ఫేజ్‌-2లో నివసించే కాట్రగడ్డ సుధాకర్‌కు క్రెటా కారు ఉంది. గతేడాది అక్టోబర్‌లో స్నేహితుడు ప్రసన్నకుమార్‌  పెళ్లి చూపుల కోసమంటూ కారు తీసుకెళ్లాడు. రోజులు  గడుస్తున్నా కారు మాత్రం తిరిగి ఇవ్వలేదు. గట్టిగా నిలదీయగా, బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితుడు  బంజారాహిల్స్‌ పోలీసులను ఆశ్రయించాడు. కారుకు సంబంధించి అన్ని పత్రాలు తన వద్ద ఉన్నాయని, న్యాయం చేయాలని పోలీసులను కోరాడు.

Updated Date - 2021-04-05T13:45:40+05:30 IST