బుల్లెట్ తగిలి ఒకరు.. అది చూసి మరో ముగ్గురు..

ABN , First Publish Date - 2021-04-05T21:36:00+05:30 IST

వేటకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు బుల్లెట్ తగిలి మరణించాడు. అపరాధభావంతో మరో ముగ్గురు యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన ఉత్తరఖండ్‌లోని టెహ్రీ జిల్లా కుండీ గ్రామ సమీపంలోని అడవిలో జరిగింది. శనివారం రాత్రి మొత్తం

బుల్లెట్ తగిలి ఒకరు.. అది చూసి మరో ముగ్గురు..

డెహ్రాడూన్: వేటకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు బుల్లెట్ తగిలి మరణించాడు. అపరాధభావంతో మరో ముగ్గురు యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన ఉత్తరఖండ్‌లోని టెహ్రీ జిల్లా కుండీ గ్రామ సమీపంలోని అడవిలో జరిగింది. శనివారం రాత్రి మొత్తం ఏడుగురు స్నేహితులు కలిసి అడవిలో వేటకు వెళ్లారు. అందులో ఒకరైన రాజీవ్(22) లోడ్ చేసిన తుపాకిని పట్టుకుని ముందు నడుస్తుండగా వెనుక అతని స్నేహితులు అనుసరిస్తున్నారు. 


ప్రమాదవశాత్తు రాజీవ్ కాలు జారి కింద పడ్డాడు. దీంతో అతని భుజాల మీద ఉన్న తుపాకి ట్రిగ్గర్‌కు చేయి తగలడంతో సంతోష్ అనే వ్యక్తి పైకి బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో తీవ్రరక్తస్రావమైన సంతోష్ అక్కడికక్కడే చనిపోయాడు. ఇది చూసి భయాందోళనకు గురైన శోభన్, పంకజ్, అర్జున్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన జరిగిన అనంతరం రాజీవ్ తుపాకీతో పారిపోయాడు. మిగిలిన ఇద్దరు వ్యక్తులు రాహుల్, సుమిత్‌లు తిరిగి ఇంటికెళ్లి కుటుంబసభ్యులకు విషయం చెప్పారు. 


ఆత్మహత్యకు యత్నించిన ముగ్గురిని గ్రామస్థులు బెలేశ్వర్ కమ్యూనిటి హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. అప్పటికే పంకజ్, అర్జున్ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. శోభన్ చికిత్స పొందుతూ ఆసుపత్రిలో చనిపోయాడు. మృతులంతా 18 నుంచి 22 సంవత్సరాల వయసు కలిగినవారేనని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2021-04-05T21:36:00+05:30 IST