కట్టుకున్న భార్యనే చెల్లి అని చెప్పి.. మరో వ్యక్తికి ఇచ్చి పెళ్లి.. ఆ తర్వాత..

ABN , First Publish Date - 2021-06-26T16:50:44+05:30 IST

కట్టుకున్న భార్యనే చెల్లి అని చెప్పి మరో పెళ్లి చేశాడో ఘనుడు. ఆ తర్వాత ఆ కొత్త పెళ్లి కొడుకు నుంచి భారీ మొత్తంలో డబ్బు, నగలను తీసుకుని ఆ భార్యాభర్తలిద్దరూ ఎస్కేప్ అయ్యారు.

కట్టుకున్న భార్యనే చెల్లి అని చెప్పి.. మరో వ్యక్తికి ఇచ్చి పెళ్లి.. ఆ తర్వాత..

కట్టుకున్న భార్యనే చెల్లి అని చెప్పి మరో పెళ్లి చేశాడో ఘనుడు. ఆ తర్వాత ఆ కొత్త పెళ్లి కొడుకు నుంచి భారీ మొత్తంలో డబ్బు, నగలను తీసుకుని ఆ భార్యాభర్తలిద్దరూ ఎస్కేప్ అయ్యారు. జరిగిందేంటో గ్రహించిన ఆ కొత్త పెళ్లి కొడుకు మోసం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  రాజస్థాన్ రాష్ట్రంలోని కోట జిల్లా కునాడి పోలీస్ స్టేషన్ పరిధిలో రవి అనే యువకుడు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే దేవ్ రాజ్ సుమన్ అనే ఓ మ్యారేజ్ బ్రోకర్‌ను కలిశాడు. తన ఫొటోలను ఇచ్చాడు. ఆ సమయంలోనే ఓ పెళ్లి సంబంధాన్ని రవికి సుమన్ చూపించాడు. కోమల్ అనే యువతి పొటోను చూపించాడు. రవికి కోమల్ తెగ నచ్చేసింది. పూర్తి వివరాలు అడిగితే.. తల్లిదండ్రులు ఎవరూ లేరు కేవలం ఓ అన్నయ్య మాత్రమే ఉన్నాడు అని చెప్పాడు. పూర్తి వివరాలు తెలుసుకున్న రవి.. కోమల్‌ను పెళ్లి చేసుకోవాలని ఫిక్సయ్యాడు. వాళ్లను ఓ రెస్టారెంట్లో కలిశాడు.


అయితే తాము కట్నం ఇచ్చుకోలేమని ముందుగానే కోమల్ అన్నయ్య సోను కార్పరే చెప్పుకొచ్చాడు. అయినప్పటికీ రవి ఒప్పుకున్నాడు. మొత్తానికి కొద్ది రోజుల క్రిందటే రవి, కోమల్ పెళ్లి ఓ గుడిలో సన్నిహితుల మధ్య జరిగింది. కోమల్ ఎప్పుడూ సోను కార్పరేతో మాట్లాడుతూ ఉండేది. అన్నయ్య కదా అని రవి ఏమీ అనుకునేవాడు కాదు. పెళ్లయిన మూడో రోజే కోమల్ కనిపించకుండా పోయింది. ఇంట్లో రెండు లక్షల రూపాయల డబ్బు, నగలు కూడా పోయాయి. దీంతో కోమల్ పనేనని రవి గ్రహించాడు. వెంటనే పోలీసులకు షిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేసే క్రమంలో మ్యారేజ్ బ్రోకర్ సుమన్‌ను విచారించారు. మొదట్లో తనకు ఏమీ తెలియదనీ, అందరు కస్టమర్లలాగానే వారికి కూడా పెళ్లి సంబంధం కుదిర్చానని చెప్పుకొచ్చాడు. కానీ అతడి ప్రవర్తనపై అనుమానం రావడంతో తమదైన శైలిలో పోలీసులు విచారించారు. దీంతో మొత్తానికి అసలు కథేంటన్నది సుమన్ బయటపెడ్డాడు. సును కార్పరే, కోమల్ భార్యాభర్తలనీ, గతంలో ఇండోర్‌లో ఉండేవారని వెల్లడించాడు. వారిద్దరూ తనను కలిసి ఎక్కువ డబ్బును ఈజీగా సంపాదించే మార్గాన్ని చెప్పారనీ, తనకు ఎక్కువ రిస్క్ లేకపోవడంతో తాను ఓకే చెప్పానని సుమన్ తెలిపాడు. సుమన్ చెప్పిన వివరాల ఆధారంగా ఆ భార్యాభర్తలిద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. 

Updated Date - 2021-06-26T16:50:44+05:30 IST