సిగరెట్ల కోసం.. పక్కదేశానికి కారేసుకుని బయల్దేరిన వ్యక్తి.. చివరికి!

ABN , First Publish Date - 2020-04-07T02:04:22+05:30 IST

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్ బాటపట్టాయి. దీంతో ఆయా దేశాల్లో వ్యాపార సముదాయాలు అన్నీ మూత పడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రజలంద

సిగరెట్ల కోసం.. పక్కదేశానికి కారేసుకుని బయల్దేరిన వ్యక్తి.. చివరికి!

న్యూఢిల్లీ: కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్ బాటపట్టాయి. దీంతో ఆయా దేశాల్లో వ్యాపార సముదాయాలు అన్నీ మూత పడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కరోనా బారినపడకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటుంటే.. ఓ వ్యక్తి మాత్రం తన రూటే సపరేటు అన్నట్టు వ్యవహరించి ప్రాణాలపైకి తెచ్చుకున్నాడు. సిగరెట్ల కోసం కాలినడకన పర్వతాలనే దాటేందుకు సిద్ధపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. 


కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో ఫ్రాన్స్‌.. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. ఈ నేపథ్యంలో పొగతాగడానికి అలవాటుపడ్డ ఓ వ్యక్తికి ఆ దేశంలో సిగరెట్లు లభించలేదు. దీంతో అతను ఉంటున్న ప్రాంతానికి స్పెయిన్ 25 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉండటంతో కారేసుకుని ఆ దేశానికి బయల్దేరాడు. మార్గ మధ్యంలో చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు అడ్డగించి అతడ్ని వెనక్కి పంపారు. అయితే ఆ వ్యకి మాత్రం తన ప్రయత్నాన్ని విరమించుకోలేదు. కాలినడక ద్వారా ఇరు దేశాల మధ్య ఉన్న పైరినీస్ పర్వతాలను దాటాలనుకుని ఆ దిశగా ముందుకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో అతను ఓ లోయలో పడిపోయాడు. ఇదే సమయంలో అటువైపు మౌంటైన్ రెస్క్యూ టీమ్ అధికారులు వెళ్లారు. లోయలో పడిపోయిన అతడ్ని.. హెలిక్టార్ ద్వారా కాపాడి.. ఆస్పత్రికి తరలించారు. అనంతరం లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు అతనికి పోలీసులు 146 డాలర్లు(సుమారు 11వేలు) ఫైన్ వేశారు. 


Updated Date - 2020-04-07T02:04:22+05:30 IST