బతికే ఉన్నా.. అంత్యక్రియలు చేసిన కుటుంబానికి వ్యక్తి షాక్!

ABN , First Publish Date - 2020-08-10T03:23:02+05:30 IST

తాను చనిపోయానని విషాదంలో ఉన్న కుటుంబానికి ఓ వ్యక్తి భయంకరమైన షాకిచ్చాడు.

బతికే ఉన్నా.. అంత్యక్రియలు చేసిన కుటుంబానికి వ్యక్తి షాక్!

లక్నో: తాను చనిపోయానని విషాదంలో ఉన్న కుటుంబానికి ఓ వ్యక్తి భయంకరమైన షాకిచ్చాడు. మృతదేహాన్ని కూడా పూడ్చేసిన కుటుంబం ముందుకు స్వయంగా తిరిగొచ్చాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది. స్థానికంగా నివసిస్తున్న ఓ వ్యక్తి తన భార్యతో గొడవపడ్డాడు. ఆ తర్వాత ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు తిరిగొచ్చాడు. అయితే అప్పటికే అతను చనిపోయాడని ఫొటోకు దండవేసేశారు కుటుంబసభ్యులు. దీంతో షాకైన ఆ వ్యక్తికి ఏం చేయాలో తెలియలేదు. తీరాచూస్తే ఎక్కడో చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహాన్ని భర్త శవంగా ఆ భార్య పొరబడింది. దీంతో సదరు వ్యక్తి మరణించినట్లు అంతా భావించారు.

Updated Date - 2020-08-10T03:23:02+05:30 IST