మక్కాను అవమానించేలా ఫేస్‌బుక్‌ పోస్టు!

ABN , First Publish Date - 2021-08-20T10:45:08+05:30 IST

ఫేస్‌బుక్‌ పోస్టే కదా అని తోచిందేదో రాసి పారేస్తే కొన్నిసార్లు కటకటాల వెనక్కి వెళ్లే ప్రమాదం ఉంది. అచ్చంగా కర్ణాటకలోని ఉడిపి జిల్లా వాస్తవ్యుడు హరీశ్‌ బంగేరా అనే వ్యక్తి మాదిరే! ఈయన ఆరేళ్లుగా సౌదీలో ఉంటున్నా

మక్కాను అవమానించేలా ఫేస్‌బుక్‌ పోస్టు!

సౌదీలో 20 నెలలు జైల్లో కర్ణాటక వాసి.. విడుదల

బెంగళూరు, ఆగస్టు 19: ఫేస్‌బుక్‌ పోస్టే కదా అని తోచిందేదో రాసి పారేస్తే కొన్నిసార్లు కటకటాల వెనక్కి వెళ్లే ప్రమాదం ఉంది. అచ్చంగా కర్ణాటకలోని ఉడిపి జిల్లా వాస్తవ్యుడు హరీశ్‌ బంగేరా అనే వ్యక్తి మాదిరే! ఈయన ఆరేళ్లుగా సౌదీలో ఉంటున్నారు. మక్కాను, సౌరాజును నిందిస్తూ ఫేస్‌బుక్‌లో హరీశ్‌ పోస్టు పెట్టారనేది ఆరోపణ. దైవదూషణ, రాజును అవమానించేలా ఆ పోస్టు ఉందని కోర్టులో రుజువు కావడంతో హరీశ్‌కు జైలు శిక్ష పడింది. దీంతో 2019 డిసెంబరు 20 నుంచి ఆయన  సౌదీలోని జైల్లోనే ఉన్నారు. హరీశ్‌ విడుదలకు ఉడిపి పోలీసులు ప్రత్యేక చొరవ చూపారు. ఇటీవల హరీశ్‌ విడుదలై బెంగళూరుకు చేరుకున్నారు. 


Updated Date - 2021-08-20T10:45:08+05:30 IST