Abn logo
Sep 22 2021 @ 12:16PM

Uttar Pradesh:ప్రియురాలిని చంపిన ప్రియుడు

రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన నిందితుడు

బిజ్నోర్ (ఉత్తరప్రదేశ్): భర్తను వదిలి లేచిపోయి తనతో  వచ్చిన వివాహితను ప్రియుడే చంపిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నోర్ నగరంలో వెలుగుచూసింది. ప్రేమలో పడి ప్రియుడితో కలిసి వచ్చిన వివాహితను చంపి, రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు చిత్రీకరించిన ఘటనను పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు.ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కాశీపూర్ పట్టణానికి చెందిన మన్‌ప్రీత్ కౌర్ అనే మహిళ సుఖ్‌వీర్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. కౌర్,సుఖ్‌వీర్ దంపతులకు ఐదేళ్ల కుమార్తె ఉంది. అయితే వివాహమైన ఐదేళ్ల తర్వాత మన్‌ప్రీత్ కౌర్ ట్రక్ డ్రైవరుగా పనిచేస్తున్న నఫీస్ అహ్మద్ అనే వ్యక్తిని ప్రేమించింది. 

భర్తను వదిలిన కౌర్ ప్రియుడు అహ్మద్ తో వెళ్లింది.అలా ప్రియుడితో లేచిపోయిన కౌర్  బిజ్నోర్‌లోని అఫ్జల్‌గఢ్‌లోని జాతీయ రహదారి 74 పై శవమై తేలింది. కౌర్ తల నుజ్జు నుజ్జు కావడంతో మొదట రోడ్డు ప్రమాదమని పోలీసులు భావించారు. కానీ కౌర్ భర్త సుఖ్ వీర్ ను విచారించడంతో ప్రియుడి విషయం వెలుగుచూసింది. ప్రియుడు అహ్మద్ ను పెళ్లి చేసుకోమని కౌర్ అడిగేదని, అతను పెళ్లికి ఇష్టపడలేదని సుఖ్ వీర్ పోలీసులకు చెప్పాడు. దీంతో నఫీస్ అహ్మద్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తాను కౌర్ ను హతమార్చి రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు చిత్రీకరించానని అంగీకరించాడు. దీంతో పోలీసులు నిందితుడైన అహ్మద్ ను అరెస్టు చేశారు. 


ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...