Advertisement
Advertisement
Abn logo
Advertisement

భార్యను మొదటిసారి అలా చూసి.. పెళ్లైన నెల రోజులకే Divorce కోసం కోర్టుకెక్కిన భర్త!

దుబాయ్: ఇప్పటివరకు వివిధ కారణాలతో దంపతులు విడాకుల కోసం కోర్టుకెక్కడం మనం చూసి ఉంటాం. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే ఈ విడాకుల ఘటన కూసింత వెరైటీ అనే చెప్పాలి. దుబాయ్‌లో ఉండే ఓ ఈజిప్టియన్ వివాహమైన నెల రోజులకే తనకు విడాకులు కావాలని తాజాగా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. ఇంతకు ఆయన భార్య నుంచి విడాకులు ఎందుకు అడుగుతున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. పెళ్లైన తర్వాతి రోజు మొదటిసారి భార్యను మేకప్ లేకుండా చూశాడు. అంతే.. వెంటనే తనకు విడాకులు కావాలంటూ కోర్టు మెట్లెక్కాడు. మేకప్ లేకుండా ఆమె అందహీనంగా ఉందని, చూడలేకపోతున్నానంటూ విడాకుల కోసం కోర్టుకెక్కాడు. దీంతో ఈ కేసు ఇప్పుడు అక్కడ సంచలనంగా మారింది. అక్కడి స్థానిక మీడియాలో ఈ వార్త ప్రస్తుతం తెగ హల్‌చల్ చేస్తోంది.

"ఫేస్‌బుక్ ద్వారా మా ఇద్దరికి పరిచయమైంది. అక్కడ మేకప్‌తో ఉన్న ఫొటోలే పెట్టింది. ఆ తర్వాత పెళ్లికి ముందు చాలాసార్లు ఆమెను డైరెక్ట్‌గా కలిశాను. ఎప్పుడు మేకప్‌తోనే ఉండడం వల్ల అందంగా కనిపించింది. దాంతో పెళ్లి చేసుకున్నాను. అయితే వివాహమైన తర్వాతి రోజు ఉదయం ఆమెను తొలిసారి మేకప్ లేకుండా చూశాను. నా కళ్లను నేను నమ్మలేకపోయాను. మేకప్ లేకుండా ఆమెను చూస్తే అసలు గుర్తుపట్టలేక పోయాను. అసలు నేను  ఇన్నిరోజులు కలిసింది ఈమేనేనా అని కొద్దిసేపు షాక్ అయ్యాను. మేకప్ లేకుండా ఆమె చూడటానికి చాలా అందహీనంగా ఉంది. నాకు విడాకులు కావాలంటూ" ఈజిప్టియన్ కోర్టులో తన గోడును వెళ్లబోసుకున్నాడు.   

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement