Advertisement
Advertisement
Abn logo
Advertisement

రైల్లో ఒంటరిగా మహిళ జర్నీ.. తన సీట్లోనే కూర్చుని నిద్రలోకి.. సడన్‌గా నిద్రలోంచి లేచి చూస్తే ఎదురుగా..

ఇంటర్నెట్ డెస్క్: ఆమె రైల్లో ఒంటరిగా ప్రయాణిస్తోంది. ప్రయాణం ప్రారంభమైన కొద్ది సేపటికి ఆమె చిన్న కునుకు తీసింది. ఇంతలో తనను ఎవరో తాకుతున్నట్టు అనిపించడంతో ఆమెకు ఒక్కసారిగా మెలకువ వచ్చింది. తలతిప్పి చూస్తే.. ఓ వ్యక్తి ఆమెవైపే చూస్తూ కనిపించాడు. దీంతో..గాబరా పడిపోయిన ఆమె.. పెద్ద పెట్టున కేకలు వేసింది. ఈలోపు..ఆ దుర్మాగుడు రైల్లోంచి కిందకు దూకేశాడు. 2013లో సెప్టెంబర్ 3న ముంబాయ్-భూసావాల్‌ ప్యాసెంజర్ రైల్లో జరిగిందీ దారుణం. నాటి గాయం ఆమెను ఇప్పటికీ వేధిస్తుంటుంది. అయితే.. మహారాష్ట్ర కల్యాణ్‌లోని ఓ రైల్వే కోర్టు తాజాగా బాధితురాలికి ఊరటనిచ్చే తీర్పు వెలువరించింది.

ఇవీ చదవండి:

మగాళ్లు కలలో కూడా ఊహించలేని కండీషన్లను భర్తకు పెట్టిందో భార్య..

కృత్రిమ గర్భానికి డబ్బుల్లేక.. వీర్యదానం చేసే వ్యక్తిని నేరుగా ఇంటికి రప్పించి..

నిందితుడికి రెండేళ్ల పాటు కఠిన కారాగార శిక్ష విధిస్తున్నట్టు జుడీషియల్ మేజిస్ట్రేట్ ఎస్ చోప్రా తాజాగా తీర్పు వెలువరించారు. అంతేకాకుండా.. బాధితురాలికి రూ. 10 వేల రూపాయల పరిహారం కూడా నిందితుడిని ఆదేశించారు. పరిహారం చెల్లించని పక్షంలో మరో నెల రోజుల పాటు జైల్లో ఉండాలని కూడా స్పష్టం చేశారు. ఇటువంటి కేసుల్లో నిందితులను ఏమాత్రం ఉపేక్షించినా మహిళల భద్రత, జీవితాలు ప్రమాదంలో పడిపోతాయని ఆయన వ్యాఖ్యానించారు. నిందితుడు అదుపు తప్పి ప్రవర్తించాడని, అతడి పట్ల జాలి చూపడం సరికాదంటూ న్యాయమూర్తి ఈ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.  

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement