Advertisement
Advertisement
Abn logo
Advertisement

వీడెక్కడి మొగుడండీ బాబూ.. పండగకు కొత్త చీర కొనమని భార్య అడిగితే ఇంత పనిచేశాడేంటి..?

ఇంటర్నెట్ డెస్క్: ఛఠ్ పూజా.. ఉత్తరభారతీయులు ఎంతో భక్తితో సూర్యోపాసన చేసుకునే పర్వదినం. ఆ పర్వదినం కోసం తనకు ఓ చీర కొనిపెట్టాలని భార్య అడిగింది. కానీ.. భర్త మాత్రం అందుకు ససేమిరా అన్నాడు. కానీ..ఆ వివాదం అక్కడితో ఆగిపోలేదు సరికదా.. మరింత ముదిరింది. భర్తతో ఆమె తీవ్ర వాగ్వివాదానికి దిగింది. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన ఆ భర్త అనూహ్యంగా తన తండ్రి లైసెన్సడ్ తుపాకీతో ఆమెను కాల్చి చంపేశాడు. ఉత్తరప్రదేశ్ దియోరియా ప్రాంతంలో మంగళవారం ఈ దారుణం జరిగింది. ఇది తెలిసిన స్థానికులు అవాక్కైపోయారు. కేవలం ఒక కొత్త చీర కావాలని అడిగినందుకు భార్యను కాల్చిచంపేశాడా అని చీర కొనీయమన్న భార్య కాల్చి చంపుతాడా అంటూ ఆశ్చర్యపోయారు. 

పోలీసుల సమాచారం ప్రకారం.. అనురాధకు ఆమె భర్త నరేంద్రకు మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. తన పుట్టింట్లో మరి కొద్ది రోజుల్లో శుభకార్యం ఉండటంతో కొత్త బట్టలు కొనమని కోరింది. అయితే.. భర్త మాత్రం తన కోసం కొని భార్యకు మాత్రం కొనలేదు. ఈ క్రమంలోనే మంగళవారం మరోసారి ఛఠ్ పూజ విషయంలో గొడవ జరిగింది. దీంతో.. రెచ్చిపోయిన ఆ భర్త ఆమెను కడతేర్చాడు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement