నడి సముద్రంలో 48 గంటల పాటు ఈదుతూనే.. ప్రతీక్షణం ప్రాణభయం.. జీవితంలో మర్చిపోలేని అనుభవం

ABN , First Publish Date - 2021-07-24T18:18:13+05:30 IST

తాము బయల్దేరిన ఓడ నడి సముద్రంలో మునిగిపోయింది.. చుట్టూ ఎటూ చూసినా నీరు..

నడి సముద్రంలో 48 గంటల పాటు ఈదుతూనే.. ప్రతీక్షణం ప్రాణభయం.. జీవితంలో మర్చిపోలేని అనుభవం

తాము బయల్దేరిన ఓడ నడి సముద్రంలో మునిగిపోయింది.. చుట్టూ ఎటూ చూసినా నీరు.. బతికే అవకాశం లేదు.. అలాంటి సమయంలో ఓ వ్యక్తి అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించాడు.. 48 గంటల పాటు సముద్రంలో ఈదుతూనే ఉన్నాడు.. ప్రతిక్షణం ప్రాణ భయంతో గడిపాడు.. చివరకు రక్షక దళాలు రావడంతో ప్రాణాలు దక్కించుకున్నాడు.. అట్లాంటిక్ మహా సముద్రంలో ఈ ఘటన తాజాగా జరిగింది. 


లైబీరియా రాజధాని మన్రోవియా తీరం నుంచి నికో ఇవాంకా కార్గో షిప్ ఈ నెల 17న బయల్దేరింది. దీనిలో మొత్తం 28 మంది సిబ్బంది ఉన్నారు. ఆ రోజు మధ్యాహ్నం ఆ ఓడ సముద్రం మధ్యలో ప్రమాదానికి గురైంది. దీంతో సిబ్బంది పోర్ట్ అధికారులకు సమాచారం అందించారు. రెస్క్యూ సిబ్బంది వెళ్లే సరికి ఓడ దాదాపు మునిపోయింది. 11 మందిని వారు రక్షించగలిగారు. మరో 17 మంది ఆచూకీ తెలియలేదు. కాగా, కొద్ది గంటల అనంతరం మరో వ్యక్తిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. అప్పటికి ఓడ మునిగిపోయి 48 గంటలు దాటింది. అన్ని గంటల పాటు అతను సముద్రంలో ఈదుతూనే ఉన్నాడు. నమ్మకం కోల్పోకుండా తన ప్రాణం కాపాడుకునేందుకు ప్రయత్నించాడు. చివరకు ప్రాణాలతో బయటపడ్డాడు.   

Updated Date - 2021-07-24T18:18:13+05:30 IST