Advertisement
Advertisement
Abn logo
Advertisement

శ్రీకాకుళం: మహిళా పీఎస్ ఎదుట యువకుడు ఆత్మహత్యాయత్నం

శ్రీకాకుళం: మహిళా పోలీసుల తీరు వివాదాస్పదమవుతోంది. తనను వేధిస్తున్నారంటూ శ్రీకాకుళం మహిళ పోలీస్ స్టేషన్ ఎదుట ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబంలో చిన్న చిన్న గొడవలకు పోలీస్ స్టేషన్‌కు వెళితే.. తన భార్యను తిరిగి పంపకుండా జాప్యం చేస్తున్నారని యువకుడు పెట్రోల్ తాగాడు. కౌన్సిలింగ్ ఇచ్చి భార్య భర్తను ఒక్కటి చేయాల్సిన పోలీసులు తన భార్యను దూరం చేస్తున్నారంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తన భార్య, పిల్లలు లేకుండా బతకలేనని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని బాధితుడు కన్నీటిపర్యంతమయ్యాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Advertisement
Advertisement