Advertisement
Advertisement
Abn logo
Advertisement

జీవితంపై విరక్తితో ఆత్మహత్య

టంగుటూరు, నవంబరు 30 : జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని కందులూరులో మంగళవారం వెలుగుచూసింది. సంఘటనపై ఎస్సై నయూబ్‌రసూల్‌ తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కందులూరుకు చెందిన సయ్యద్‌ ఖాదర్‌బాషా(46) భార్య 20 ఏళ్లనాడే అతనిని వదిలి వెళ్లిపోయింది. ఉన్న ఇద్దరు పిల్లలూ మానసిక దివ్యాంగులే. మతిస్థిమితం లేని కుమారుడు అతని వద్ద, కుమార్తె తల్లి వద్ద ఉంటోంది. ఇటీవలే ఖాదర్‌బాషాకు పక్షవాతం కూడా వచ్చింది. ఎదురైన వరుస సంఘటనలతో మానసికంగా కుంగిపోయాడు. రెండు రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాత్‌రూంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సొంత పనిపై రెండు రోజుల క్రితం వేరే ఊరు వెళ్లిన ఖాదర్‌బాషా సోదరుడు అహ్మద్‌బాషా దంపతులు మంగళవారం తిరిగి వచ్చారు. వారు వచ్చి చూశాక బాత్‌రూంలో ఖాదర్‌బాషా ఉరివేసుకొని మృతి చెందిన విషయం బయటపడింది. అహ్మద్‌బాషా ఫిర్యాదు మేరకు ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement