ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పిన విషయం విని నివ్వెరపోయిన కుర్రాడు.. కంగారుగా అతడి ఇంటికి వెళ్లి చూస్తే..

ABN , First Publish Date - 2021-08-07T21:16:09+05:30 IST

ఇంట్లో సరదాగా ఉండగా ఆ కుర్రాడికి ఫోన్ వచ్చింది. చూస్తే తన మిత్రుడు రజత్ జాధవ్. ఏంటా ఇలా సడెన్‌గా ఫోన్ చేశాడు? ఏమైనా పనా? అని ఫోన్ ఎత్తాడు. అంతే అవతలి వైపు నుంచి రజత్ చెప్పిన మాటలతో ఆ యువకుడు నివ్వెరపోయాడు.

ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పిన విషయం విని నివ్వెరపోయిన కుర్రాడు.. కంగారుగా అతడి ఇంటికి వెళ్లి చూస్తే..

ఇంటర్నెట్ డెస్క్: ఇంట్లో సరదాగా ఉండగా ఆ కుర్రాడికి ఫోన్ వచ్చింది. చూస్తే తన మిత్రుడు రజత్ జాధవ్. ఏంటా ఇలా సడెన్‌గా ఫోన్ చేశాడు? ఏమైనా పనా? అని ఫోన్ ఎత్తాడు. అంతే అవతలి వైపు నుంచి రజత్ చెప్పిన మాటలతో ఆ యువకుడు నివ్వెరపోయాడు. ఫోన్ కట్ అవగానే వణుకుతున్న చేతులతో ఒక నంబర్‌కు ఫోన్ చేసి గబగబా ఇంట్లో నుంచి బయటకు పరిగెత్తాడు. అతను అంతలా టెన్షన్ పడటానికి బలమైన కారణమే ఉంది. ఎందుకంటే అతని స్నేహితుడు రజత్ ఫోన్‌లో తాను చనిపోతున్నట్లు చెప్పాడు మరి. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో వెలుగు చూసింది.


స్థానికంగా ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్న రజత్ అనే యువకుడు.. ఆరోజు ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. అతని కుటుంబం బయటకు ఎక్కడికో వెళ్లింది. ఆ సమయంలో సునీతా పటేల్ అనే యువతి రజత్‌ను కలవడానికి వచ్చింది. ఇద్దరూ ఇంట్లోకి వెళ్లిన కాసేపటికి విషం తాగేశారు. ఆ తర్వాత తన మిత్రుడికి రజత్ ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో ఆందోళన చెందిన ఆ మిత్రుడు వెంటనే రజత్ కుటుంబానికి సమాచారమిచ్చాడు. అందరూ ఇంటికొచ్చేసరికి స్పృహలేని స్థితిలో ఉన్న జంట కనిపించింది. వెంటనే వారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. సునీత పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను మరో  పెద్ద ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడకు వెళ్లేసరికే ఆమె చనిపోయింది. రజత్ కూడా చికిత్స పొందుతూ కన్నుమూశాడు. వీళ్లిద్దరి మరణాలు ఆ కుటుంబాలను షాక్‌కు గురిచేశాయి. ఎందుకంటే రజత్ ఎవరో కూడా సునీత కుటుంబానికి తెలీదు. అలాగే సునీతను రజత్ కుటుంబం కనీసం చూడలేదు కూడా. అయితే వీళ్లిద్దరూ కలిసి ఒకే చోట పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. వీళ్లిద్దరూ ఎందుకు ఆత్మహత్య చేసుకుందీ తెలియరాలేదు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-08-07T21:16:09+05:30 IST