Abn logo
Sep 23 2021 @ 19:31PM

ఆర్టీసీ బస్సులో మహిళపట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోకిరీ.. పోలీసులు రంగంలోకి దిగి..

ఇంటర్నెట్ డెస్క్: ఈ మధ్య మహిళలపై వేధింపులు ఎక్కువయ్యాయి. ఎప్పటికప్పుడు పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. పోకిరీల బుద్ధి మాత్రం మారటం లేదు. తాజాగా ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళ పట్ల ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. ముద్దుపెట్టి, అక్కడ నుంచి పరారైన ఘటన కర్నాటకలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..


బెంగళూరులోని విజయనగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న మధుసూధన్ రెడ్డి అనే వ్యక్తి.. ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ.. ఓ మహిళపట్ల అమర్యాదగా ప్రవర్తించాడు. అకస్మాత్తుగా తన సీటులోంచి లేచి.. బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ సీటు వద్దకు వెళ్లాడు. బస్సు పీన్య బస్టాప్ వద్దకు చేరుకోగానే.. ఆమెకు ముద్దుపెట్టి అక్కడ నుంచి పరారయ్యాడు. దీంతో సదరు మహిళ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. వెంటనే స్థానికంగా ఉన్న పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు.. పీన్య బస్టాప్ పరిసర ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులోని దృశ్యాల ఆధారంగా మధుసూధన్ రెడ్డిని అదుపులోకి తీసుకుని కటకటాల వెనక్కి నెట్టారు. 


ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...